జలమండలి కీలక నిర్ణయం..ఇక నో టెన్షన్..

జలమండలి కీలక నిర్ణయం..ఇక నో టెన్షన్..

లోకల్ గైడ్:
హైదరాబాద్‌ నగరంలో సమ్మర్ టెన్షన్ మెుదలైంది.ఎండా కాలం వచ్చిందంటే చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడుతుంది.గతేడాది ట్యాంకర్లతో కొందరు నీటికి తెప్పించుకున్నారు.ఈ ఏడాది కూడా పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి.ఇప్పుడే ట్యాంకర్లతో నీటిని తెప్పించుకున్నారు. కొందరు అధిక డబ్బులు చెల్లించి మరీ ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు.అయినా కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఉంటుంది.బస్తీల్లో అయితే నీటి సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.ఉస్మాన్‌సాగర్‌ నుంచి హైదరాబాద్ నగరానికి నీటిని తరలించేందుకు ప్రస్తుతం ఉన్న కాండ్యూట్‌కు సమాంతరంగా మరో పైపులైను ఏర్పాటుకు రెడీ అయ్యారు.హైదరాబాద్‌ నగరంలో తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఉస్మాన్‌సాగర్‌ నుంచి అదనంగా నీటిని తీసుకునేందుకు వీలుగా సమాంతరంగా కొత్త పైపులైన్‌ను ప్రతిపాదించారు.దాదాపు 14.5 కిలోమీటర్ల పొడవున కొత్త పైపులైన్‌ వేయడానికి జలమండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.సుమారు వందేళ్ల క్రితం ఉస్మాన్‌సాగర్‌ నుంచి రోజుకు 25 ఎంజీడీల నీటిని తరలించే సామర్థ్యంతో పాత కాండ్యూట్‌ను నిర్మించారు.అప్పటి నుంచి నగర అవసరాలకు కాండ్యూట్‌ ద్వారా నీటిని తరలిస్తున్నారు.ముందుగా ఆసిఫ్‌నగర్‌ ఫిల్టర్‌ బెడ్స్‌కు నీరు చేరుతుంది.అక్కడ జలాలు ఫిల్టర్ చేసి ఆ తర్వాత నగరంలో వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.  

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు