జర్నలిస్టుల పక్షాన సిపిఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు
ఖమ్మం, లోకల్ గైడ్:
*ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు - అధికారులు, ప్రభుత్వాలు - ప్రతిపక్షాలు ఇలా ప్రతి ఒక్కరికీ కష్ట సుఖాల్లో ఏదో ఒక రకంగా మీడియా (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్) తనవంతుగా సహకారాన్ని అందిస్తూనే ఉంది. ఇది జగమెరిగిన సత్యం. మీడియా లేకుండా ప్రభుత్వాలు లేవు, ప్రతిపక్షము లేదు. ఇది కూడా వాస్తవం.గత 30 ఏండ్లుగా అనేక హామీలపై ఆశతో జర్నలిస్ట్.. తన భార్య, పిల్లల నివాసంకోసం(ఇండ్ల స్థలాలు) ఎదురుచూస్తుంటే.. ఎన్ని నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, పోరాటాలు చేస్తున్నా.. ఫలితం రాకపోగా, లేనిపోని వాటిని భూతద్దంలో చూపిస్తూ.. యూనియన్ల అనైక్యత పేరుతో విచ్ఛిన్నం చేయడానికో, లేదా వ్యక్తిగతంగా డామేజ్ చేయడానికో, లేదా న్యాయపరమైన ఇబ్బందులు ఉండొచ్చునేమో అనే అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారే తప్ప మేమున్నాం అంటూ ఇండ్లస్థలం ఇప్పించేంతవరకు వెన్నుదన్నుగా ఉంటారనుకునేవాళ్ళు ఎవరూ లేకపోవడం తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేస్తోంది. కానీ అన్ని అర్హతలు, అవకాశాలు ఉన్న జర్నలిస్టుల ఇండ్లస్థలాల విషయంలో సీపీఐ(ఎం) జర్నలిస్టులకోసం ధర్నా చౌక్ లో ధర్నా చేయడం, తన సీపీఐ(ఎం) కార్యాలయంలో జర్నలిస్టులు, ఇతర పార్టీల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం, సిపిఐ(ఎం) జిల్లా, రాష్ట్ర మహాసభల్లో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, వారి సమస్యలు పరిష్కరించాలని తీర్మానం చేశారు. ఇలా ఏదో ఒక రూపంలో జర్నలిస్టులు పక్షాన సిపిఐ(ఎం) పార్టీ నిలుస్తుంది. తాజాగా సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన జాన్ వెస్లీ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ రాశారు. వెంటనే జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, జర్నలిస్టు సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) పార్టీకి మరియు రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కి జర్నలిస్టుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
Comment List