అప్ఘాన్‌దే టాస్.. మరి మ్యాచ్ ఎవరిదో చూడాలి..!
లోకల్ గైడ్:
ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక మ్యాచ్ ప్రారంభమైంది.గ్రూప్-బిలో సెమీస్ చేరే జట్లను ఖరారు చేసే ఆస్ట్రేలియా-అఫ్ఘానిస్థాన్ మ్యాచ్ లాహోర్ వేదికగా ప్రారంభమైంది.క్వార్టర్ ఫైనల్‌గా భావిస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్ఘానిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.దీంతో ఆస్ట్రేలియా ఫస్టు బౌలింగ్ చేస్తోంది.ఫిబ్రవరి 19న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 మొదలవగా..గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ చేరాయి.గ్రూప్-బి నుంచి ఇంగ్లాండ్ ఇప్పటికే నిష్క్రమించింది.సెమీస్ రేసులో ఆస్ట్రేలియా,దక్షిణాఫ్రికా,అప్ఘానిస్థాన్‌లు ఉన్నాయి.ఇవాళ్టి మ్యాచులో గెలిచిన జట్టు నేరుగా సెమీస్ చేరనుంది.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అప్ఘానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది తొలుత బ్యాటింగ్ చేయడానికి మొగ్గుచూపాడు.“వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది.రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ మందకొడిగా మారుతుందనిపిస్తోంది.అందుకే ముందుగా బ్యాటింగ్ చేస్తున్నాం.ఇంగ్లాండ్‌పై ఆడిన తుది జట్టు తోనే ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోకి దిగాం హష్మతుల్లా అన్నాడు.ఇక తాను టాస్ గెలిచినా..బౌలింగే ఎంచుకునేవాడినని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు.పిచ్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయని..దూకుడుగా ఆడటమే తమ లక్ష్యమన్నాడు.ఇంగ్లాండ్‌తో ఆడిన జట్టుతోనే ఆడబోతున్నట్లు స్మిత్ చెప్పాడు.కాగా ఆస్ట్రేలియా-అఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య ఇప్పటివరకు నాలుగు వన్డేలు జరిగాయి.అందులో అన్నింట్లోనూ ఆస్ట్రేలియానే గెలుపొందింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో అప్ఘాన్..తృటిలో విజయాన్ని చేజార్చుకుంది.
Comment List