రేవంత్ రెడ్డి దిగజారుడు ఆరోపణలు: కిషన్ రెడ్డి
లోకల్ గైడ్, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, వ్యక్తిగతంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. బాధ్యతారహితంగా, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని అన్నారు.బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆయన, రాష్ర్టాలకు సంబంధించిన ప్రాజెక్టుల మంజూరు, నిధుల కేటాయింపులో తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ గెలుపు కోసమో, రెచ్చగొట్టడం కోసమో రాజకీయాలు చేయదన్నారు. దేశం, రాష్ర్టం అభివృద్ధి చేయాలనేదే తమ నినాదమని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ 150 కార్పొరేషన్లలో 50 శాతం బీసీ లకు కేటాయించిన సీట్లలో 30 సీట్లలో నాన్ బీసీలు గెలుచుకొని లబ్ధి పొందుతుంటే నోరు మూసుకొని కూర్చోవాలంటే వారికి జనాభా ప్రాతిపదికన హక్కులు రావాలని బీజేపీ పోరాడుతుందన్నారు. ఇది సీఎం రేవంత్ నిజస్వరూపమని మండిపడ్డారు. శనివారం తప్పుడు ఆరోపణలను తిప్పికొడుతూ రాష్ర్ట బీజేపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అనుభవ రాహిత్యంతో మాట్లాడుతున్నారని అన్నారు. తాను తెలంగాణ అభివృద్ధిపై అనేక ప్రాజెక్టులపై ప్రజలకు వివరిస్తూనే ఉన్నానని చెప్పారు. గత పదేళ్లుగా అనేక కేంద్ర పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ర్ట ప్రభుత్వం సహకారం అందించకపోవడం వల్ల అమలు చేయలేదన్నారు. పంటలబీమా, ఆయుష్మాన్ భవ ఉదాహరణలన్నారు.తప్పుడు ఆరోపణలపై ఎదురుదాడి..కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్న వందరోజుల్లో ఆరు గ్యారంటీలు, 320 సబ్ గ్యారంటీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకుందన్నారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనపై ఎదురుదాడి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో నేడు అంతర్గత కుమ్ములాటలు, సీఎంపై అసంతృప్తి ఆయన మాట్లాడుతున్న విధానంలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. బీజేపీ, తనను బ్లాక్ మెయిల్, బీజేపీని బెదిరించినంత మాత్రాన, అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన ఆయనపై ఉన్న వ్యతిరేకత పోదన్నారు. నేడు తెలంగాణ ప్రజలు ఆయన మాటలు వినే పరిస్థితి లేదన్నారు. అనేక హామీలకు నమ్మి ఓటేస్తే ఏది అమలు చేయలేదని ఏ సామాజిక వర్గం సీఎం రేవంత్ రెడ్డి మాటలను సీరియస్ గా తీసుకునే పరిస్థితులు లేవన్నారు. పెద్ద గొంతుతో మాట్లాడినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావన్నారు. గతపదేళ్లుగా తెలంగాణలో ఏం చేశామనే విషయం ఇదివరకే ప్రజలంతా చూశారన్నారు. రూ. 10 లక్షల కోట్లతో రెండున్నరగంటలపాటు ఆర్టీసీ కళ్యాణ మండపం, పింగళి భవన్ లో వివరించామన్నారు. కేంద్రమంత్రి బెదిరిస్తున్నారని దిగజారి సీఎం మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇవన్నీ దిగజారుడు, దివాళా కోరు ఆరోపణలన్నారు. మూడున్నరేళ్లుగా అంకితభావంతో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, కేంద్ర కార్యాలయాలు, విద్యాలయాలు, మౌలిక సదుపాయాలపై కేంద్రానికి వివరించి అభివృద్ధిని దరిచేర్చేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.
Comment List