రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోడపత్రికలు విడుదల చేసిన కలెక్టర్ 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోడపత్రికలు విడుదల చేసిన కలెక్టర్ 

భద్రాది కొత్తగూడెం బ్యూరో,లోకల్ గైడ్, తెలంగాణ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు "ఆర్థిక అక్షరాస్యత - మహిళా సాధికారత" పై ఫిబ్రవరి 24 నుండి 28 వ తేది వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ప్రచురించబడిన గోడ పత్రికలను జిల్లా కలెక్టర్  జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. ఆర్థిక అక్షరాస్యత సమాజంలో ప్రతి ఒక్కరికీ అవసరమని ముఖ్యంగా మహిళలు ఆర్థిక వ్యవహారాల్లో అవగాహన కలిగి ఉండడం ద్వారా త్వరితగతిన ఆర్థిక ప్రగతి సాధించవచ్చు అన్నారు.మహిళల కొరకు ఆర్థిక ప్రణాళిక, పొదుపు మరియు నష్ట నివారణ చర్యలు, ఆర్థిక పరిపుష్టికి రుణాలు పొందడం తదితర అంశాలపై గృహిణులు, ఉద్యోగినులు, స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు, కళాశాల విద్యార్థినులకు అన్ని బ్యాంక్ శాఖలు, ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు బ్యాంక్ అధికారులు విరివిగా రుణాలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రామిరెడ్డి, ఐడిఓసి మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు