అవసరమైతే చస్తాగానీ.. లుచ్చా పనులు చేయను : కేటీఆర్ 

అవసరమైతే చస్తాగానీ.. లుచ్చా పనులు చేయను : కేటీఆర్ 

లోక‌ల్ గైడ్: తాను కేసీఆర్‌ సైనికుడినని, నిఖార్సయిన తెలంగాణ బిడ్డను అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) అన్నారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను అంతర్జాతీయం చేయడానికి ప్రయత్నించామన్నారు. మీలా బావమరుదులకు కోట్లాది రూపాయల కాంట్రాక్టులు తాము కట్టబెట్టలేదని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెళ్లి మీలా దొరికిపోయిన దొంగను కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అరపైసా అవినీతికి పాల్పడలేదని చెప్పారు. ఏదో రకంగా బురదజల్లి తాత్కాలిక ప్రయోజనం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ 420 హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని, వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందని, అవసరమైతే చస్తా తప్ప.. లుచ్చా పనులు చేయనని తెలిపారు. ఫార్ములా-ఈ రేసు కేసులో మాజీ ఏఏజీ రామచంద్రారావుతో కలిసి ఏసీబీ విచారణకు కేటీఆర్‌ హాజరయ్యారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News