వంగూరి వాచకం — చలి

వంగూరి వాచకం — చలి

వంగూరి వాచకం — చలి
————————————
      —     వంగూరి గంగిరెడ్డి

1.తన అడ్డాకు పోతేనే 
దాడి చేస్తుంది పులి 
ఇంటి లోపల ఉన్ననూ 
వణికిస్తూ ఉంది  చలి

2.గతి తప్పిన వాతావరణంతో 
మితిమీరిన చలి 
పొద్దు ఎంతైనా నెయ్యంతో 
వొద్దు వొదలనంటున్న  కంబలి

3.చలి చెలరేగితే
 కలిగి తీరదా ఎవరికైనా కంపనం 
ఆదిత్యుడే అదిరిపోయి ఆలస్యంగా ఇస్తున్నాడు దర్శనం

4.రాత్రి తొందరగా 
పడుకొనివ్వదు చరవాణి 
పొద్దున తొందరగా 
లేవనివ్వదు చలిరాణి 

5.జరభద్రం...
మరవొద్దు భద్రతలు 
పెరిగిన చలి 
రోగాలకు నెచ్చెలి

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News