ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌.. ప్రకటించనున్న ఈసీ....

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌.. ప్రకటించనున్న ఈసీ....

లోక‌ల్ గైడ్ : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగరా మరికొన్ని గంటల్లో మోగనుంది.మధ్యాహన్నం ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నది. ఢిల్లీ 7వ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 15తో ముగియనుంది. ఆలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. దీంతో నెల రోజుల ముందుగానే ఎన్నికల ప్రక్రియను ఈసీ మొదలు పెట్టనుంది.
అధికారం నిలుపుకోవాలని ఆప్‌, ఈసారైనా ఢిల్లీ గద్దెనెక్కెలని కాంగ్రెస్‌, బీజేపీలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనే హామీల వర్షం కురిపిస్తున్నాయి. కాగా, గత రెండు పర్యాయాలు కేజ్రీవాల్‌ ( నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీఘన విజయం సాధించింది. మరోసారి అధికారం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ఆప్‌ ఖరారు చేసింది. న్యూఢిల్లీ స్థానం నుంచి అరవింద్‌ కేజ్రీవాల్‌ బరిలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి అతిశీ మరోసారి కల్కాజీ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మంజాతో గొంతులు తెగుతున్నాయి...! మంజాతో గొంతులు తెగుతున్నాయి...!
లోక‌ల్ గైడ్: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి...
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం..
తిరుపతి తొక్కిసలాట ఘటన....
తెలంగాణ‌లో పదో తరగతి పరీక్షల ఫీజు గడువు పెంపు...
KTR చెప్పినట్లే చేశాం...!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
దేశ భవిష్యత్తు యువతతో మారుతుంది -  ABVP