అక్షర వెలుగులు

అక్షర వెలుగులు

అక్షర వెలుగులు
---------------------------------------
లోకల్ గైడ్:

వినీల ఆకాశంలో 
వెలుగునిచ్చే చంద్రునిలా 
భక్తుల కోరికలు తీర్చే దేవుడిలా 
బిడ్డకు జన్మనిచ్చిన తల్లిలా...
కొవ్వత్తిలా కరిగిపోతూ
విద్యను బోధించే గురువులా
నిస్వార్ధంగా నిత్యం ప్రజాసేవ
చేసే నాయకుడిలా...
 
అజ్ఞానాన్ని తొలగించి 
విజ్ఞానాన్ని అందించే గురువులా
ప్రపంచానికి వెలుగును
ప్రసాదించే సూర్యుడిలా
శిలను శిల్పంగా చెక్కిన శిల్పిలా...
మనిషిని మహోన్నతుడుగా
మార్చింది అక్షరమే 
మనిషిని మహాత్ముడిని 
చేసేది అక్షరమే...

అక్రమాలకు,అన్యాయాలకు
ముగింపు పలికేది అక్షరమే
ధర్మాన్ని సంరక్షించేది అక్షరమే
ఆర్థిక అసమానతలను తొలగిస్తూ
ఉత్తమ స్థానం కలిగించేది అక్షరమే...
అపార్థాలు,అనర్థాలకు స్వస్తి పలికి 
శాంతి చేకూర్చేలా చేసేది అక్షరమే 
యువతలో చైతన్య స్ఫూర్తిని కలిగిస్తూ ధర్మస్థాపన చేసేలా చేసేది అక్షరమే...

దేశ కీర్తిని పెంచుతూ
భరతమాత ఎదుటి పై తిలకంలా ప్రకాశించేది అక్షరమే
అక్షర సామ్రాజ్యాన్ని నిర్మించుటకు బ్రహ్మాస్త్రంలా నిలిచేది అక్షరమే...
అక్షర జ్యోతులను వెలిగిద్దాం 
అక్షర శక్తిని చూపిద్దాం 
అక్షర విలువను గుర్తిద్దాం 
అక్షరంతో విజయం సాధిద్దాం...

వి.జానకి రాములు గౌడ్
లింగంధన

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News