విద్యార్థులకు తప్పని ఇబ్బందులు స్పందన లేని అధికారులు..
ఎఐఎస్ఎఫ్ షాద్ నగర్ ఇంచార్జ్ ఆకాష్ నాయక్ డిమాండ్
లోకల్ గైడ్ :: అన్ని సబ్జెక్టులు రోజు చెబితేనే విద్యార్థులకు అర్థం అయ్యేది తక్కువ అలాంటిది,ఒక సబ్జెక్టు టీచర్ లేకుంటే, అందులోను మన మాతృభాష తెలుగు బోధించకపోతే ఏం అర్థం అవుతుంది? పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. అసలే ఈ మధ్యన తెలుగు పరీక్షలో తప్పుతున్న(ఫెయిల్)ఎక్కువ అవుతున్నారు...విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ షాద్నగర్ ఇన్చార్జ్ ఆకాష్ నాయక్ నియోజకవర్గం నాయకులు పాఠశాలను సందర్శించి, విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలిపిన వివరాల ప్రకారం... జిల్లేడు చౌదరి గూడెం మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుండి 10 వరకు మొత్తం 356 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ,తెలుగు ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల కోరిక మేరకు గుర్రంపల్లి పాఠశాల నుండి వారానికోసారి వచ్చి తెలుగు సబ్జెక్టు బోధించి వెళ్తున్నారని, తద్వారా పాఠలు జరగక ఇబ్బందులకు గురైతున్నామని విద్యార్థులు,విద్యార్థి సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిప్యూటేషన్ పై వెళ్లిన ఉపాధ్యాయురాలు తిరిగి రావాలి..
సబ్జెక్టు బోధించే వాళ్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న దానిపై విద్యార్థి సంఘం నాయకులు,మీడియా,సంబంధిత ఉపాధ్యాయులను సమాచారం అడగగా,,, డిప్యూటీషన్ పై వెళ్లిన ఉపాధ్యాయురాలు పై అధికారుల పైరవీలతో విషయంలో జిల్లా కాకుండా స్టేట్ నుండి పంపినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సబ్జెక్టు టీచర్ లేకుంటే విద్యార్థుల పరిస్థితి ఏంటని మీడియా ద్వారా ఆకాష్ నాయక్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా డిప్యూటీషన్ వెళ్లిన తెలుగు టీచర్ ను తిరిగి ఇదే పాఠశాలకు వచ్చేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు..లేనిచో విద్యార్థులతో,తల్లిదండ్రులతో కలిసి మండల కేంద్రంలో ధర్నా చేయడం జరుగుతుందని ఏఐఎస్ఎఫ్ షాద్నగర్ ఇన్చార్జ్ ఆకాష్ నాయక్ నియోజకవర్గం నాయకులు హెచ్చరిస్తున్నారు. మరి సంబంధిత అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో అని ఆవేదన వ్యక్తం చేసారు..
Comment List