నూతన సంవత్సర వేడుకలకై  కట్టుదిట్టమైన  బందోబస్త్ పూర్తి ఏర్పాట్లు.

జిల్లా ఎస్పీశ్రీ కె.నారాయణ రెడ్డి

నూతన సంవత్సర వేడుకలకై  కట్టుదిట్టమైన  బందోబస్త్ పూర్తి ఏర్పాట్లు.

 లోకల్ గైడ్:నూతన సంవత్సర వేడుకలకు సంబందించి పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది.వాటిని కచ్చితంగా పాటించాలని జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి, ఐపీఎస్ తెలియజేయడం జరిగింది.
•    డి‌జే మరియు సౌండ్ బాక్స్ లకు, పెద్ద పెద్ద శబ్దాలకు  ఎలాంటి అనుమతులు లేవు. 

•    రిసార్ట్ మరియు ఫామ్ హౌస్ లపై ప్రత్యేకమైన నిఘా వుంటుంది.రిసార్ట్ మరియు ఫార్మ్ హౌస్ లలో  ఎలాంటి ఆశీల్లత కార్యక్రమాలు జరపకూడదు.

•    మద్యం త్రాగి, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, చేసిన వాహన నియామ నిబందలను పాటించకుండా వాహనాలు నడిపిన వారిపై వాహనాలు సీజ్ చేసి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

•    31 డిసెంబర్ అర్దరాత్రి సమయం లో నూతన సంవత్సరం వచ్చిన సంధార్బంగా ఎవ్వరూ కూడా రేసింగ్ లు , బైక్ ర్యాలీలు ఎలాంటి అనుమతి లేదు.  

•    31 డిసెంబర్ సాయంత్రం నుండి నూతన సంవత్సరం ఉదయం సమయం వరకు జిల్లా లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబందీ, వాహన తనికీలు  మరియు  డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ లు వం  నిర్వహించడం జరుగుతుంది. కావున వాహనదారులు ఖచ్చితంగా వాహనాలకు సంబందించిన పత్రాలు కల్గి ఉండాలి.

•    నూతన సంవత్సరం సంధార్బంగా జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా  పెట్రోలింగ్ మరియు బందో బస్త్ లు ఏర్పాటు చేయడం జరుగుతుంది.

•    పోలీస్ అధికారులు పై తెలపబడిన విధులు నిర్వహించే సమయం ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే అట్టి సంఘటనలను వీడియో లు చిత్రీకరించి కేసులు నమోదు చేయడం జరుగుతుంది.

•    ఎవరైనా నూతన సంవత్సర వేడుకలు పెద్ద ఎత్తున్న చేస్తే వారు  పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఇతర శాఖల నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకొని, పోలీస్ అధికారులు ఇతర శాఖల అధికారులు తెలిపిన నియమ నిబందనలు కచ్చితంగా  పాటించాలి.


బహిరంగ ప్రదేశాలలో ఎవరైనా వేడుకల పేరుతో ఇతరులకు ఇబ్బందులు గురిచేసిన యెడల అట్టి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

  పోలీసు శాఖ నుండి వెలువడిన సూచనలు సలహాలను  అతిక్రమించిన వారిపై ప్రజా భద్రత రీత్యా చట్టపరమైన చర్యలను తీసుకోవడము జరుగుతుంది.

పై సూచనలు పాటించి జిల్లా ప్రజలు పోలీస్ అధికారులకు పూర్తిస్థాయిలో తమ సహాయ సహకారాలు అందించాలని, డిసెంబర్  31 రాత్రి  రోజున మద్యం మత్తులో వాహనాలపై యువకులు రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదలకు లోనూ అయి సంతోష కరమైన రోజుని విషాదకరంగా చేసుకోవద్దు. 

    సంతోషకరంగా, సురక్షితంగా నూతన సంవత్సర వేడుకలను  తమ తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో  కలసి జరుపుకోవాలని కోరుతూ,
  ప్రజలకు ఏమైనా శాంతిభద్రతల సమస్య ఉంటే డైల్ 100 కి కాల్ చేయాలని తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక
లోకల్ గైడ్: కేశంపేట మండల కేంద్రంలో  బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళల యొక్క హక్కుల కోసం చదువుల కోసం మరియు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అలుపెరగని...
సారు కేశంపేట్ కు సర్వేరు రారా..
ఓ గురువర్యా! నీ స్థానమేక్కడ?
తొలి మహిళా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194 జయంతి
మహనీయుల స్ఫూర్తి,  ఆశయాలతో ముందుకు సాగాలి
రేషన్‌ కార్డులో మీ వాళ్ల పేర్లను చేర్చాలా.. అయితే ఇదే ప్రాసెస్ 
పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు..!