ప్రభుత్వ దావఖానాలో పైసా వసూల్.

ప్రభుత్వ దావఖానాలో పైసా వసూల్.

మాకు ఖర్చులుంటాయి ఓ పి లకు ఒక్కొక్కరి వద్ద పది రూపాయలు చొప్పున వసూలు చేస్తున్న సిబ్బంది...

లోకల్ గైడ్ :రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ దవాఖానాలో అనారోగ్య సమస్యలతో ఓపి కోసం వస్తున్న రోగుల వద్ద హాస్పిటల్ సిబ్బంది పది రూపాయలు చెప్పున వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మాకు ఖర్చులుంటాయి అంటూ వింత సమాధానమిస్తున్నారు. డబ్బులు లేకపోతె ఓపి చిట్టి ఇవ్వకుండా పక్కకు పంపిస్తున్నారంటు రోగులు వాపోతున్నారు. ఇక్కడి హాస్పిటల్ కు రోగులు రోజు వందల సంఖ్యలో వస్తుంటారు. వచ్చే ప్రతి ఒక్కరి దెగ్గర వసూలు చేసే డబ్బులు లెక్కేస్తే కలక్షన్ ప్రైవేట్ హాస్పిటల్ కు మించి పోతుంది.  ప్రభుత్వ హాస్పిటల్ అంటే పలు గ్రామల నుండి బీద ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి వైద్యం కోసం వస్తుంటారు. ఉచిత వైద్యం చెయ్యాల్సిన వారే డబ్బులడుగుతున్నారని, ఇలా రోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక
లోకల్ గైడ్: కేశంపేట మండల కేంద్రంలో  బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళల యొక్క హక్కుల కోసం చదువుల కోసం మరియు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అలుపెరగని...
సారు కేశంపేట్ కు సర్వేరు రారా..
ఓ గురువర్యా! నీ స్థానమేక్కడ?
తొలి మహిళా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194 జయంతి
మహనీయుల స్ఫూర్తి,  ఆశయాలతో ముందుకు సాగాలి
రేషన్‌ కార్డులో మీ వాళ్ల పేర్లను చేర్చాలా.. అయితే ఇదే ప్రాసెస్ 
పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు..!