నల్లగొండ వన్ టౌన్ పట్టణ పరిధిలో ఆకస్మిక తనిఖీలు.
నల్లగొండ జిల్లా ప్రతినిధి.
లోకల్ గైడ్ :
నల్లగొండ పట్టణంలో మంగళవారం సాయంత్రం నల్గొండ వన్ టౌన్ పిఎస్ పట్టణ పరిధిలోని ప్రకాశం బజార్, దేవరకొండ రోడ్‌లో, జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్, ఆదేశానుసారం, నల్గొండ డిఎస్పి కె శివరాం రెడ్డి సూచనల మేరకు, ఆంటీ నార్కోటిక్స్ స్నిఫర్ డాగ్ సహాయంతో అనుమానస్పద ప్రదేశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పాన్ షాప్, లాడ్జిలు మరియు ఇతర రద్దీ ప్రదేశాలలో డాగ్ సాయంతో చెకింగ్ చేయడం జరిగింది.అలాగే వాహన తనిఖీలలో, ఎలాంటి డాక్యుమెంట్స్ లేని వాహనదారులపై 35 ఈ చలాన్లు, నిన్న అర్ధరాత్రి వాహనాల చెకింగ్‌లో తాగి వాహనం నడుపుతున్న 11 మంది పై డిడి కేసులు నమోదు చేయడం జరిగింది. ఇట్టి తనిఖిలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై సైదులు, ఎఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్, శ్రీకాంత్, రబ్బాని, కృష్ణ నాయక్, మహమూద్, కృష్ణ రెడ్డి తదితరులు నిర్వహించారు.
Comment List