పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత‌

పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత‌

లోక‌ల్ గైడ్ :
ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. కోటికిపైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. వృక్షో రక్షతి రక్షితః అంటూ నిత్యం ప్రచారంచేసిన ఆయన రోడ్ల పక్కన, పాఠశాలలు, దవాఖానలు, దేవాలయాల్లో మొక్కలు నాటారు. రామయ్య సేవలకుగాను 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. రామయ్యకు భార్య, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కాగా ఇద్దరు కుమారులు ఇప్పటికే వివిధ కారణాలతో చనిపోయారు. కాగా, రామయ్య మృతితో ప్రకృతి ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు. రామయ్యను కడసారి చూడటానికి భారీగా తరలి వస్తున్నారు. బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ సంతోష్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సహా పలువురు రాజకీయ నేతలు రామయ్య మృతిపట్ల సంతాపం తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యూవత క్రీడారంగంలో రణ్ణించాలి యూవత క్రీడారంగంలో రణ్ణించాలి
లోకల్ గైడ్: మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి
భారత రాజ్యాంగమే దేశానికి ప్రజలకు రక్ష 
అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంబు ప్రభాకర్
బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంబేద్కర్ కు నివాళులర్పించిన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వా జయంతి సందర్భంగా నివాళులర్పించిన 
పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్ ని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ .