రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య  ‘షష్టి పూర్తి’ చూడండి ..

డెఫినెట్ గా బావుంటుంది.”  - ‘మాస్ మహారాజా‘ రవితేజ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య  ‘షష్టి పూర్తి’ చూడండి ..

లోక‌ల్ గైడ్:  నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్, జాతీయ ఉత్తమ నటి అర్చన కాంబినేషన్ లో రూపేష్,ఆకాంక్ష సింగ్  హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘షష్టి పూర్తి ‘ . పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మేస్ట్రో’ ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇందులో తొలిపాటను ఆస్కార్ విన్నర్ కీరవాణి రచించగా ఇటీవల విడుదల చేశారు.సంచలన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేసిన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. రెండో పాటను ‘మాస్ మహారాజా’ రవితేజ ఆవిష్కరించి, యూనిట్ కి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ –“మా రాజేంద్రప్రసాద్ అన్నయ్య ‘షష్టి పూర్తి’ చూడండి.. డెఫినెట్ గా బావుంటుంది. మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందనిపిస్తోంది. దర్శక నిర్మాతలకు,ఆర్టిస్టులకు అందరికీ ఆల్ ది బెస్ట్ “ అని చెప్పారు.
” ఇరు కనులు కనులు కలిసి మురిసె
 మొదటి చూపులో
తొలి పిలుపు తగిలి మెరుపు మెరిసే మనసు నింగిలో “...అంటూ రెహమాన్ రాసిన ఈ పాటను ఎస్పీ చరణ్ , విభావరి ఆలపించారు. ఆ విశేషాలను దర్శకుడు పవన్ ప్రభ తెలియజేస్తూ “సినిమాలో చాలా అందమైన యుగళ గీతం ఇది. ఇళయరాజా గారు బాణీ ఇవ్వగానే నాకు ‘సాగర సంగమం’ లో ‘మౌనమేలనోయి ‘పాటలాంటి గొప్ప పాట అవుతుందనే అనుభూతి కలిగింది. ఈ ట్యూన్ కి రెహమాన్ శరవేగంతో సాహిత్యం సమకూర్చారు. ఇళయరాజా గారు ఒక్క కరక్షన్ కూడా చెప్పకుండా ఓకే చెప్పేశారు. ఎస్పీ చరణ్,విభావరితో ఈ పాట పాడించారు. అసలు ట్యూన్ వినగానే నాదీ,
రూపేష్ గారి మొహాలు వెలిగిపోయాయి. ఇక మొత్తం పాట రికార్డు అయ్యాక మా మొహాల్లో వెన్నెల కురిసినంత ఆనందం. అసలు ఈ పాట రికార్డింగ్ కూడా చాలా లవ్లీ గా ,లైవ్లీ గా జరిగింది. సింగర్స్ ఎవరిదారిన వాళ్ళు వచ్చి పాడి వెళ్లిపోకుండా ఇద్దరూ పక్క పక్కన నిలబడి ఓ ఫీల్ తో ఈ డ్యూయట్ ని ఆలపించారు. కధలో సమ్మిళితమైన ఈ పాట, ఈ సినిమాకే కొత్త అందాన్ని,అనుభూతిని తీసుకొచ్చింది. ఈ పాట చిత్రీకరణని రాజమండ్రి లో ఈశ్వర్ నృత్య దర్శకత్వంలో తీశాం. మంచి ఎండల్లో అందరూ కస్టపడి,ఇష్టపడి ఈ పాట బాగా రావడానికి సహకరించారు. ముఖ్యంగా మా ఛాయాగ్రాహకుడు రామ్ రెడ్డి. మామూలుగానే గోదావరి అందంగా ఉంటుంది. ఇక తోట తరణి గారి కళా దర్శకత్వ నైపుణ్యం వల్ల ఈ పాటలో గోదావరి రెట్టింపు అందంతో కనిపిస్తుంది. మా హీరో హీరోయిన్లు రూపేష్,ఆకాంక్ష సింగ్ లపై  ఈ పాటను చిత్రీకరించాం” అన్నారు.

రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్ ,  'కాంతార' ఫేమ్ అచ్యుత్ కుమార్, సంజయ్ స్వరూప్, తెనాలి శకుంతల, ఆనంద చక్రపాణి, రాజ్ తిరందాసు, మురళీధర్ గౌడ్, 'చలాకి' చంటి, 'బలగం' సంజయ్, అనుపమ స్వాతి, రుహీనా, అనిల్, కెఏ పాల్ రాము, మహి రెడ్డి, శ్వేతా, లత, ప్రవీణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి, అంబరీష్ అప్పాజీ ఇందులో ప్రధాన తారాగణం.

'షష్టిపూర్తి' చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం; పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను; పీఆర్వో: పులగం చిన్నారాయణ; మార్కెటింగ్: టాక్ స్కూప్; ప్రొడక్షన్ కంట్రోలర్: బిఎస్ నాగిరెడ్డి; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్; స్టంట్స్: రామకిషన్; ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి, కొరియోగ్రఫీ: స్వర్ణ మాస్టర్, నిక్సన్ మాస్టర్, ఈశ్వర్ పెంటి, లిరిక్స్: కీరవాణి, చైతన్య ప్రసాద్, రెహమాన్; కో డైరెక్టర్: సూర్య ఇంజమూరి; డీఓపీ: రామ్, సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, బ్యానర్: మా ఆయి ప్రొడక్షన్స్; నిర్మాత: రూపేష్, స్క్రీన్ ప్లే- సంభాషణలు- దర్శకత్వం : పవన్ ప్రభ.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

చదువు పట్టుదల ఉంటే, పేదోడైన ప్రపంచమేదావి కాగలడని నిరూపించిన అంబేద్కర్ చదువు పట్టుదల ఉంటే, పేదోడైన ప్రపంచమేదావి కాగలడని నిరూపించిన అంబేద్కర్
అందే బాబయ్య " బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ను అవమానించిన"అంటరాని వారిగా చూసిన" ఈ...
అంబేద్కర్ ఆశయ సిద్ది కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి .
తెలంగాణ రాష్ట్రం గవర్నర్ 
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతిని ఘనంగా నిర్వహించుకున్న ఐటిడిఎ ,పిఓ బి ,రాహుల్.
డా:బి.ఆర్ అంబేద్కర్,కా:జార్జిరెడ్డిల
ఆత్మ గౌరవంతో బతకాలని పోరు చేసిన మహాత్మా ఫూలే