పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..

జల్లే జయరాజు సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు.

పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..

మహబూబాబాద్ లోకల్ గైడ్ :

గురువారం రోజున సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కేసముద్రం మండల కేంద్రంలోని ఇంటికన్నె గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామశాఖ కార్యదర్శి ముద్ర కోళ్ల శ్రీను ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించినారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రాస్తారోకోలు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో ప్రజా  కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ నిత్యవసర వస్తువులపై ధరలు పెంచుతూ పేద నిరుపేద మధ్యతరగతి ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు 41% తగ్గిన భారతదేశంలో ఒంట గ్యాస్ ,డీజిల్, పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి ప్రజలను దోపిడీ  చేస్తుందని అన్నారు. దేశంలోని ప్రజలు పనులు లేక పస్తులు ఉంటుంటే దేశంలో బిజెపి మోడీ బిజెపి ప్రభుత్వం రోజురోజుకు నిత్యవసర సరుకులు ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుందని అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన వంట గ్యాస్  పెట్రోల్  డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ సభ్యులు పుట్ట ముత్తయ్య  కదిరే రాజు సోమరపు ఎల్లయ్య మరియు వెంకటరమణ  సావిత్రమ్మ సమ్మక్క  మమత  రమ చిర్ర మల్లయ్య  బెజ్జం వినేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యూవత క్రీడారంగంలో రణ్ణించాలి యూవత క్రీడారంగంలో రణ్ణించాలి
లోకల్ గైడ్: మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి
భారత రాజ్యాంగమే దేశానికి ప్రజలకు రక్ష 
అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంబు ప్రభాకర్
బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంబేద్కర్ కు నివాళులర్పించిన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వా జయంతి సందర్భంగా నివాళులర్పించిన 
పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్ ని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ .