కార్పొరేట్ల కొరకే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది..
అందుకే ఈ అక్రమ నిర్బందాలు ఆంక్షలు.
పినపాక ప్రభాకర్, రాష్ట్ర కన్వీనర్, కార్మిక సంక్షేమ సంఘం..
లోకల్ గైడ్ న్యూస్:
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కార్పొరేట్లకు అప్పజెప్పడానికి పథకాన్ని రూపొందించారని, అందులో భాగంగానే వర్సిటీలో ఘోరమైన నిరంకుశ, నిర్బంధ అక్రమ పాలన కొనసాగుతోందని కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ అన్నారు.. యూనివర్సిటీ లో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలుగు మొదటి పండగ ఉగాది రోజు దొంగల్లా బుల్డోజర్లను పెట్టీ పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ ఆ భూములను ప్రభుత్వమే కబ్జాకు ప్రయత్నిస్తే అడ్డుకున్న విద్యార్ధులను విచక్షణా రహితంగా కొట్టి, ఆడపిల్లలని కోడా చూడకుండా ఈడ్చుకుంటూ తీసుకెళ్లటం ఇదేనా ప్రజా పాలనా? అర్థరాత్రి బుల్డోజర్లతో పనులు చేయించటం ఏంటి? ఈ పోరాటానికి మద్దతు ఇచ్చిన వారిని కూడా నిర్బంధించి అక్రమ అరెస్టులు చేయటం దేనికి సంకేతం? అని విమర్శించారు. హెచ్సీయూ రిజిస్ట్రార్ స్పష్టంగా కీలక ప్రకటన చేశారనీ, 2024 జూలైలో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని హెచ్సీయూ రిజిస్ట్రార్ స్పష్టం చేశారనీ, ఇప్పటి వరకూ భూమి ఎలా ఉందని ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని తేల్చిచెప్పారు అన్నారు. హద్దులు అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను కోడా ఖండించారని, ఇప్పటి వరకూ భూమి సరిహద్దులు గుర్తించలేదని అన్నారు అని, అయినా ప్రభుత్వం మొండిగా వాదిస్తూ, కావాలనే ఇలాంటి నిర్బంధ ఖాండను కొనసాగిస్తూ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు. ఇకనైనా రేవంత్ రెడ్డి పునరాలోచించాలని, నిర్బంధాలకు స్వస్థి పలకాలని, ఆ భూమిని యూనివర్సిటీ కి అప్పగించాలని డిమాండ్ చేశారు..
Comment List