30 ఏళ్లయిన పెళ్లి కాలేదా!... అయితే సంతానం కష్టమే ?
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- ప్రస్తుత రోజుల్లో చాలా మంది కెరియర్ ను దృష్టిలో పెట్టుకొని 30 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లి చేసుకోవట్లేదు. చదువుల పరంగానో లేదా సెటిల్ అవ్వాలనే ఆలోచనతో పెళ్లి అనే మాటను పక్కన పెట్టేస్తున్నారు. అయితే తాజాగా వైద్యునిపుణులు ఇచ్చిన హెచ్చరికలు చూస్తుంటే 30 సంవత్సరాలు దాటినా కూడా పెళ్లి చేసుకోపోతే, భవిష్యత్తులో సంతానం అనేది కష్టమే అని చెప్తున్నారు. లక్ష్యాలను సాధించాలనే ఆలోచనతో చాలా మంది మగవాళ్ళు 30 నుంచి 35 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లి చేసుకోవట్లేదు. మరికొందరు ఏమో సెటిల్ అయ్యాకే పిల్లల్ని కనాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, 35 ఏళ్లు దాటిన తర్వాత వీర్యంలో శుక్ర కణాల సంఖ్య తగ్గుతుందని, వాటి ఆకారం మారిపోయి కదలికలు తగ్గుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ' పిల్లలు పుట్టడానికి ముఖ్యమైన టెస్టోస్టెరాన్ 35 ఏళ్ల నుంచి తగ్గుతూ ఉంటుంది. కాబట్టి 35 ఏళ్లు వచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకపోతే సంతానం ఎక్కువ మోతాదులో కష్టమే అని చెప్తున్నారు వైద్యులు. ఒకవేళ ఆ వయసులోనూ పిల్లలు కణాలనే ఉద్దేశం లేకపోతే ప్రతిరోజు కూడా వ్యాయామం చేయాలని.. అప్పుడే సంతానం విషయంలో ఎటువంటి సమస్యలు కలగవు అని వైద్యులు చెబుతున్నారు.
Comment List