వేసవిలో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?... జర జాగ్రత్త!
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- ఈ భూమ్మీద ఉన్న ప్రతి మనిషికి కూడా కూల్ డ్రింక్స్ తాగడం అంటే చాలా ఇష్టం. కానీ అవి ఆరోగ్యానికి చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదమని తాజాగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ లోని శాస్త్రవేత్తలు తెలిపారు. కూల్ డ్రింక్స్ లో ఎక్కువ మోతాదులో ఉండే సుక్రోజ్ తో మన మానవుని శరీరానికి ప్రమాదమేనని తాజాగా ఎలుకలపై చేసిన పరిశోధనలలో వెల్లడించబడింది. అధిక శాతం సుక్రోజ్ఉండే పానీయాలతో మనుషులకు మధుమేహం, ఊబ కాయం వచ్చేటువంటి ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు చాలామందికి జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని తెలిపారు. కాబట్టి తక్షణమే ఎక్కువగా శీతల పానీయాలు తాగడం మానేయండి. చాలామంది కూడా వేసవి కాలం వస్తే కచ్చితంగా కూల్ డ్రింక్స్ ను ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ కూల్ డ్రింక్స్ బదులు అధిక మొత్తంలో మనిషి నీటినే తాగాలని వైద్యం నిపుణులు సూచించారు. శీతల పానీయాల కన్నా ఎక్కువ మోతాదులో పండ్ల రసాలను లేదా నీటినే తాగాలని వైద్య శాస్త్రవేత్తలు తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కూల్ డ్రింక్స్ తాగడం తగ్గించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని మీ కుటుంబానికి అలాగే మీ మిత్రులకు తెలియజేయండి.
Comment List