క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరాకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలి
జిల్లాలో 97 శాతం పన్నుల వసూలు పూర్తి

అన్ని ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐస్ ప్యాక్స్, ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉండాలి
వేసవి దృష్ట్యా ప్రణాళికాబద్ధంగా ప్రజలకు తాగునీరు అందించాలి
మంచి నీటి ఎద్దడి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి
వడదెబ్బకి గురికాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి
జనసంద్రం ఉండే ప్రతి చోట చలివేంద్రం ఏర్పాటు చేయాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
లోకల్ గైడ్ తెలంగాణ:
క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరాకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.
గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేశ్ కుమార్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రుజ్వాన్ బాషా షేక్ ఎంపిడిఓలు, తహసీల్దార్ లు, ఎంపీఓలు, ఎంఏఓలు, మండల ప్రత్యేక అధికారులు, మిషన్ భగీరథ, గృహ నిర్మాణ, పంచాయతీ రాజ్ శాఖల డీఈలు, ఈఈలు, ఏఈలతో వడ దెబ్బ, తాగునీరు, సాగునీరు, ఉపాధి హామీ పనులు, ఎల్ఆర్ఎస్ ప్రక్రియ, ఇందిరమ్మ ఇళ్లు, తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎండల తీవ్రత దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎండలు మొదలైన నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలనే అంశంపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా, మండల స్థాయిలోని ప్రతి కార్యాలయంలో, బస్ స్టాండ్ ల వద్ద, రైల్వే స్టేషన్ పరిధిలో, ఇలా అధిక రద్దీ ఉండే ప్రాంతాల్లో సిబ్బందిని నియమించి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మండల స్థాయిలో ప్రత్యేక అధికారులు సమన్వయ సమావేశాన్ని నిర్వహించాలని, జిల్లాలో వడగాలులతో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులు ఉదయం 11 గంటల వరకు పూర్తి కావాలన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీకి వంద ఓఆర్ఎస్ ప్యాకెట్ లను పంపించాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ లను సరిపడా అందుబాటులో ఉంచాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు, మున్సిపల్, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, వ్యవసాయ కూలీలు, తదితర క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న కూలీలు ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలన్నారు. అన్ని ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తర్మోమీటర్లు, మందులు, ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్స్, బీపీ ఆపరేటర్స్, అంబులెన్స్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. చిన్నారులు, గర్భిణీల దృష్ట్యా ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించాలన్నారు.పరిశుభ్రత పాటించాలి.ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే చలివేంద్రాల వద్ద పరిశుభ్రత పాటించాలని, తాగునీరు, గ్లాసులు, కుండలు, వాటిపై ప్లేట్ లు ఉండాలని, అవన్నీ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం తగదని కలెక్టర్ పేర్కొన్నారు.సాగునీటికి సరిపడా నీటిని అందించాలి.జిల్లాలో ఎక్కడా కూడా నీటి మళ్లింపు లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగుకు నీటిని అందించాలన్నారు. మండల స్థాయిలో సమావేశాలను నిర్వహించి, సాగునీటిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి, రోజూ వారీగా నివేదికను సమర్పించాలన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List