ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్

ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్

- రూ.కే కార్పొరేట్ ఆర్థోపెడిక్ చికిత్స సేవలు
- పేదప్రజల ప్రశంసలు అందుకుంటున్న ఎముకల ప్రత్యేక వైద్య నిపుణులు హర్షవర్ధన్
- ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న వైద్యులు హర్షవర్ధన్
- ప్రజా వైద్యశాల పేర పేదలకు రూ.కే ఆర్థోపెడిక్ కార్పొరేట్ వైద్యం
- వైద్యులకు స్ఫూర్తి గా నిలుస్తున్న హర్షవర్ధన్
- ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న హర్షవర్ధన్

ఇల్లందు- (లోకల్ గైడ్ తెలంగాణ)

- ఇల్లందు: నేటి రోజుల్లో ప్రజలు వైద్యానికి రూ.లక్షల్లో అధిక మొత్తంలో ఖర్చు చెయ్యడం రోజు రోజుకూ పెరుగుతున్నాయి.  ఏ చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా పలు ప్రయివేటు ఆసుపత్రుల్లో అవసరం లేకున్నా పరీక్షలు అంటూ, ప్రత్యేక నిపుణులు అంటూ రోగులను ఫీజులు పేర నిలువు దోపిడీ చేస్తున్న సందర్భాలు కోకొల్లలు. రూ.లక్షలు పెట్టి వైద్య వృత్తి ని ఎన్నుకొని వైద్యులు అయ్యాక రూ.లక్షలు సంపాదించాలని చూసే వైద్యులు అధికంగా ఉన్న నేపథ్యంలో మానవతా దృక్పథంతో  ప్రజా వైద్యశాల పేర కేవలం రూ.కే కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న వైద్యులు హర్షవర్ధన్ అందరి వైద్యులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఆయనే..  ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల లో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఎముకల శస్త్ర చికిత్స వైద్య నిపుణులు హర్షవర్ధన్. వైద్యులు పుచ్చలపల్లి రామచంద్ర రెడ్డి ని ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకు నేటి రోజుల్లో ఎంతో ఖరీదైన ఆర్థోపెడిక్ వైద్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు లో ప్రజా వైద్యశాల పేరుతో కేవలం రూ.1కే కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు ఆపద్బాంధవుడిగా, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందిస్తున్నారు. ఒక మారుమూల మన్యం ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తూ వైద్య సేవలు అందించడంతో పాటు కేవలం రూ.1కే ప్రజా వైద్యశాల పేర అత్యంత ప్రాముఖ్యత గల ఆర్థోపెడిక్ వైద్య చికిత్సలు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉండి అందరి మన్ననలు పొందుతున్నారు. ఎముకలు, మోకాళ్ళ చిప్పలు, కండరాలు తదితర ఎంతో మంది రోగులకు శస్త్ర చికిత్సలు నిర్వహించారు.  ఇటీవలే ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డుతో సత్కరించటం గమనార్హం.  ఈ మేరకు నిస్వార్థంగా ఎంతో కష్టపడి, ఎంతో వెచ్చించి సాధించిన వైద్య వృత్తిని అమితంగా గౌరవించి పేద ప్రజలకు రూ.1కే ఎముకల సంబంధించిన కార్పొరేట్ స్థాయి ఆర్థోపెడిక్ వైద్య చికిత్స అందించి వైద్యులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి