ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా  కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా 

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా  కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా 

విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాల 

పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి 

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్

సంగారెడ్డి: లోకల్ గైడ్

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో  అన్యాయం జరుగుతుందన్నారు. గడిచిన పదేళ్లలో  టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని బ్రష్టు పట్టించిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యారంగాన్ని అభివృద్ధి పరుస్తాం సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన మాటను అధికారంలోకి వచ్చి15 నెలలు అవుతున్న అమలు చేయడం లేదన్నారు. పెండింగ్స్ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయని వాటిని విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. ఒకవైపు కళాశాల యాజమాన్యాలు ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నారని వారు పేర్కొన్నారు. గురుకులాలు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు  అద్దె భవనాలల్లో కాలం వెళ్ళదీస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిధులను పెంచి విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని వారు డిమాండ్ చేశారు. యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ నియమించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేడని స్వయానా ముఖ్యమంత్రి ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నప్పటికీ విద్యారంగ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు . విద్యారంగాన్ని విద్యార్థులను విస్మరించిన గత ప్రభుత్వాలు  అధికారాన్ని కోల్పోయాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలని  లేనిపక్షంలో గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టి రాజేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ,అర్జున్, ఎస్ఎఫ్ఐ నాయకులు, రవి, కిరణ్,అనిల్ కుమార్, శేఖర్, రాజు, నవీన్, కుమార్,మేఘన నవ్య జ్యోతి కావ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి