చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు
హుజూరాబాద్, లోకల్ గైడ్ :
హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని లక్ష్మినర్సింహస్వామి దేవాలయంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపన, కళ్యాణ మండపం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా జరిగే పూజకార్యక్రమాల్లో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని వేదపండితులు ఉదమర్రి కృష్ణమూర్తి శర్మ కోరారు. లక్ష్మీనర్సింహస్వామి కటాక్షాలు గ్రామంపై ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు తులతూగాలని లక్ష్మీనర్సింహస్వామి విగ్రహాప్రతిష్టాపనను జరుపుతున్నామనీ. తెలిపారు. ప్రతిష్ట మూడు రోజుల సందర్భంగా ఈరోజు రెండవ రోజు కుంకుమ పూజలు ధాన్యాధివాసము, పుష్పాదివాసము, ఫలాదివాసం, సయననాదివాసము, జరుపబడినది. ఈ కార్యక్రమంలో ఉదమరి కృష్ణమూర్తి శర్మ, దామెర వెంకటేశ్వర చార్యులు, వేదపండితులు దామెర హయగ్రీవ చార్యులు, శేషాచార్యులు, వెంకట రమణాచార్యులు, రాంబాబు చార్యులు తదితర భక్తులు పాల్గొన్నారు.
Comment List