కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి
మార్చి 26న ఢిల్లీలో ధూంధాం
విలేకరుల సమావేశంలో డాక్టర్ జేరిపోతుల పరశురామ్
ఖమ్మం (లోకల్ గైడ్ తెలంగాణ)
రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డా బి ఆర్ అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోట్ల పై ముద్రించాలని డిమాండ్ చేస్తూ మార్చి 26న ఢిల్లీలో వందలాది కళాకారులతో జరగనున్న " ధూం దాం " కార్యక్రమానికి పెద్ద ఎత్తున కవులు కళాకారులు ప్రజలు తరలి రావాలని కరెన్సీ పై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డా జేరిపోతుల పరశురామ్ పిలుపు నిచ్చారు.ఖమ్మం ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరుశురాం మాట్లాడుతూ...
న్యాయమైన డిమాడ్ లక్ష్యాసదానకు సంపూర్ణ మద్దతూగా ఎంపీలు,రాజ్యసభ సభ్యులు రాజకీయ పార్టీల అధ్యక్షులు ప్రజలు ప్రజాస్వమిక వాదులు రాబోతున్నారని తెలిపారు.1921 లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పకూలినప్పుడు "రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం" అనే పుస్తకాన్ని వ్రాసి హిల్టాన్ యాంగ్ కమిషన్, రాయల్ కమిషన్, బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల 1927 ఏర్పడిన సైమన్ కమిషన్ ఇది వాస్తవాన్ని గ్రహించి 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది అంటే అది అంబేద్కర్ కృషి వల్ల నాడు అంబేద్కర్ లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదని, ఆ మహనీయుని ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించడం లేదు అంటే ఆయన విస్మరించడమే చరిత్రను వక్రీకరించడమే అవుతుందని,అంబేద్కర్ త్యాగాలను వారి చరిత్రను కనుమరుగు చేస్తున్నారాని ఆవేదన వ్యక్తం చేశారు
భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న పాలకులు అంబేద్కర్ పట్ల భారత రాజ్యాంగం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని మార్చి 10 నుండి జరుగే పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి సాంసృతిక విభాగం జాతీయ కన్వీనర్ గట్టగల్ల సంజీవ ప్రజాసంఘాల రాష్ట్ర కో ఆర్డినేటర్ పాలకుర్తి కృష్ణ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భద్రునాయక్, కంబంపాటి రాజారత్నం నరపోగు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comment List