అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై మంత్రి సీతక్క సమీక్ష
లోకల్ గైడ్, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం సచివాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.హాజరైన మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెల, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్ అలేఖ్య పుంజాల.పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, serp సీఈఓ దివ్య దేవరాజన్, పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన, స్పెషల్ కమిషనర్ బీ షఫీ ఉల్లా, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణ, మహిళా సాధికారత కోసం కొత్తగా తీసుకోబోయే కార్యక్రమాలపై చర్చించారు. పలు రాష్ట్రాల్లో మహిళా సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం. దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందించాలని నిర్ణయం.
Comment List