పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.

బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ .నాగం వర్షిత్ రెడ్డి

పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.

 తెలంగాణ గైడ్ ,నల్గొండ జిల్లా  జిల్లా బ్యూరో:

పంట కులాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం  నల్గొండ మండలం పరిధిలోని రాములబండ, రంగారెడ్డి నగర్ గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను , నల్లగొండ జిల్లా బిజెపి బృందం పరిశీలించి , రైతుల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కట్టుబడి ఉంటామని రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో సాగునీటి సరఫరా నిలిచిపోయిందని కాలువల్లో నీరు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు అన్నారు. మౌలిక సదుపాయాల లోపం వలన చెరువులు, రిజర్వాయర్లు ,పూర్తిగా దెబ్బతిన్న ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ పథకాల ఆచరణలో ఫెయిల్ అయిందని, రైతుల సంక్షేమం కోసం ప్రకటించడం పథకాలు చేతులు కాల్చేలా మారాయి అన్నారు. పరిహారం లేకపోవడం ,నష్టపోయిన రైతులకు ఎటువంటి  భరోసా ఇవ్వకుండా ప్రభుత్వం మౌనం ఊహిస్తుందన్నారు. ప్రభుత్వం  కాలువల ద్వారా నీటి విడుదలను వెంటనే చేపట్టాలని, ఎండిపోయిన పంటలను తక్షణమే సర్వే చేసి ప్రభుత్వం సహాయం అందించాలని, చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని  కష్టాల్లో ఉన్న రైతులకు రుణమాఫీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ , జిల్లా జనరల్ సెక్రెటరీ పొత్తపాక లింగస్వామి , మండల అధ్యక్షులు అనిల్ , జిల్లా కోశాధికారి పకీరు మోహన్ రెడ్డి , యువ మోర్చ నాయకులు పెన్నింటి నరేందర్ రెడ్డి , తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు