రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్నర్.?
లోకల్ గైడ్:
హిట్టు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నటుడు నితిన్. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ . హిట్టు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నటుడు నితిన్ . ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నాడు. భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్.అయితే సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించబోతున్నాడని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. డేవిడ్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే రాబిన్ హుడ్ ప్రమోషన్స్‌లో డేవిడ్ వార్నర్ కూడా పాల్గోంటాడని దర్శకుడు వేణు తాజాగా తెలిపాడు. ఇక డేవిడ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో పాల్గోంటాడ లేదా నేరుగా ప్రీ రిలీజ్ వేడుకకు వస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comment List