ఎట్టకేలకి తెలుగు సినిమా తెరపై మెరవబోతున్న డేవిడ్ వార్నర్.
లోకల్ గైడ్:
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ఆయన క్రికెట్‌తోనే కాదు తన రీల్స్‌తో కూడా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ఆయన క్రికెట్‌తోనే కాదు తన రీల్స్‌తో కూడా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు.గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ తరచుగా సోషల్ మీడియాలో తెలుగు హీరోల డైలాగులు చెబుతూ రీల్స్ చేయడం మనం చూసాం.బాహుబలి,పుష్ప,డీజే టిల్లు అంటూ పలువురు టాలీవుడ్ సినిమా హీరోల స్టైల్‌ను అనుకరిస్తూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేశాడు.ఈ క్రమంలో తెలుగు అభిమానులు వార్నర్ ని డేవిడ్ మామ అని ముద్దుగా పిలుచుకుంటూ వస్తున్నారు.అయితే ఆయన మన తెలుగు సినిమాలో తళుక్కున మెరిసిన బాగుంటుందని కొందరు తమ కోరికని వెళ్లబుచ్చారు. అభిమానుల కోరిక నెరవేరింది.ఇప్పుడు డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలో కనిపించి సందడి చేయబోతున్నాడు. హీరో నితిన్ నటించిన రాబిన్‌హుడ్‌లో డేవిడ్ కనిపిస్తాడని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగిన దానిని ఎవరు ఖండించలేదు,నిజం చేయలేదు.ఇప్పుడా ప్రచారాన్ని నిజం చేస్తూ నిర్మాత రవిశంకర్ అభిమానులకి అదిరిపోయే శుభవార్త అందించారు.‘కింగ్‌స్టన్’సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత రవి శంకర్..రాబిన్‌హుడ్‌లో వార్నర్ అతిథి పాత్ర పోషించినట్టు చెప్పి ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించారు.అయితే వార్నర్‌ది చిన్న పాత్రే అని చెప్పిన ఆయన ఏ పాత్రలో కనిపిస్తాడనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు.
Comment List