ప్రత్యేక వైకల్య గుర్తింపు (సదరం)కార్డు కొరకు యుడిఐడి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

వికారాబాద్ జిల్లా ప్రతీక్ జైన్ 

ప్రత్యేక వైకల్య గుర్తింపు (సదరం)కార్డు కొరకు యుడిఐడి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

లోకల్ గైడ్ వికారాబాద్ :-
మంగళవారము కల్లెక్ట్రేట్ వి సి హాలు నందు జిల్లా గ్రామీణ అభివ్రుది అధికారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.సదరం ధ్రువీకరణ పత్రాల కోసం యుడిఐడి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా దివ్యాంగులకు అవగాహన కల్పించాలన్నారు.  గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ, విఎల్ఇ కేంద్రాలను ఆశ్రయించేవారని,  ఇప్పుడు వీటితోపాటు యుడిఐడి పోర్టల్ , స్వంత మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ మరియు స్లాట్లు చేసుకోవచ్చని తెలిపారు. క్యాంపుల వివరాలు కూడా సందేశం (మెసేజ్) ద్వారా తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.    21 రకాల వైకల్యం కలిగిన వారు యుడిఐడి ( యూనిక్ డిజాబ్లిటీ  ఐడి ) కార్డును పొందవచ్చని తెలిపారు.  సదరం కార్డును కూడా పోస్టల్ ద్వారా అభ్యర్థులకు చేరవేయడం జరుగుతుందని అన్నారు. గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కలిగి ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, దివ్యాంగులు ఎలాంటి అపోహలకు గురికాకుండా వారికి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.జిల్లా లో సదరం క్యాంప్ నిర్వహించే సందర్భాల్లో దివ్యాంగులకు అసౌకర్యం కలుగకుండా  ర్యాంపు , త్రాగునీరు, టై లెట్స్  అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశం లో  డి ఆర్ డి ఓ శ్రీనివాస్, జిల్లా వైద్య అధికారి వెంకట రావణ, డి సి ఎచ్ ఎస్  ప్రదీప్, జిల్లా పంచాయతి అధికారి జయసుధ, సుపరింతెన్దేంట్ వినోద్, డి ఫై ఎం నర్సిములు, ఎ ఫై ఎం కమలాకర్ సంబంధిత అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు