రోడ్డు భవనాల శాఖ & సినిమా ఆటోగ్రఫీ మంత్రి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి
ఉద్యమ నిరుద్యోగ కళాకారుల రాష్ట్ర కమిటీ కలిసి వినతి పత్రం అందించారు.
లోకల్ గైడ్ ,హైదరాబాద్, ప్రతినిధి:
సాంస్కృతిక సారధిలో తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సినిమా ఆటోగ్రఫీ మరియు రోడ్డు భవనాల శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని హైదరాబాదులోని మినిస్టర్స్ క్వాటర్స్ లో కలసి వినతిపత్రం అందజేశారు.రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనవోజు వెంకటేశం నకిరేకంటి కిరణ్ కుమార్ మాట్లాడుతూ... గత బిఆర్ఎస్ ప్రభుత్వం 550 మంది కళాకారులను గుర్తించి సాంస్కృతిక సారధిలో ఉద్యోగ అవకాశాలు కల్పించి నిజమైన ఉద్యమ కళాకారులను విస్మరించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామని గత పిసిసి అధ్యక్షులు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలియజేశారు. ఈ విషయమై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించి సీఎం రేవంత్ రెడ్డి గారికి సిఫారసు చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో జవ్వాజి ప్రవీణ్ కుమార్, కొండ్ర కుమార్, హైమద్, మోతె రమేష్ ,పున్నా రమేష్ , పేరాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Comment List