బ్యాగులు మోయవద్దని కాంగ్రెస్ ఇంఛార్జ్ అనడం పెద్ద జోక్: కేటీఆర్

బ్యాగులు మోయవద్దని కాంగ్రెస్ ఇంఛార్జ్ అనడం పెద్ద జోక్: కేటీఆర్

లోకల్ గైడ్, హైదరాబాద్: బ్యాగులు మోసి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకొని బ్యాగులు మోయొద్దని కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మీనాక్షి  మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అప్పట్లో చంద్రబాబుకు బ్యాగులు మోస్తే ,ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డి బ్యాగులు మోస్తున్నాడని ఆరోపించారు. మంచి మైక్ లో చెప్పాలి చెడు చెవిలో చెప్పాలంటున్న రేవంత్ ఒక్క మంచి పని చేయలేదు కాబట్టే ఎవరూ మైక్ లో చెప్పడం లేదన్నారు.  హైడ్రా విధ్వంసం, ఆర్ఆర్ టాక్స్, భూకబ్జాలు, అంతులేని అవినీతితో కుప్పకూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు, మునిగిన వట్టెం పంప్ హౌస్ ఇలా చెప్పడం మొదలుపెడితే రేవంత్ చెవుల నుంచి రక్తం కారుతుందన్నారు కేటీఆర్. చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండల మాజీ MPP  గోవర్ధన్ రెడ్డితో పాటు సుమారు 500 మంది బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్, తెలంగాణలో రేవంత్ రెడ్డిని తిట్టని వ్యక్తి లేరన్నారు.  జనవరి 26న ఖాతాల్లో డబ్బులు పడతాయని హామీ ఇచ్చి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. రుణమాఫీ జరగలేదు, పెన్షన్లు పెరగలేదు, రైతు భరోసా లేదు, ఆడబిడ్డలకు తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి నిలిపివేశారు" అని ఆరోపించారు.కేసీఆర్ హయాంలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో విధ్వంసం, అరాచకాలతో కుప్పకూలిందన్నారు కేటీఆర్. "హైడ్రా, మూసి కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీశారు. మేడ్చల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేయడం దురదృష్టకరం” అన్నారు కేటీఆర్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మాట్లాడుతూ, "కేసీఆర్ హయాంలో 90% పనులు పూర్తయ్యాయి. కేవలం 10% పనులు చేస్తే చేవెళ్లకు నీళ్లు వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి అలా చేయడం లేదు. కేసీఆర్‌కు పేరు వస్తుందన్న అసూయతో ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మూసి సుందరీకరణ కోసం రూ.1,50,000 కోట్లు ఖర్చు చేసి కమిషన్లు దండుకొని, కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపి తన పదవి కాపాడుకోవాలని చూస్తున్నారు" అని విమర్శించారు."కేసీఆర్ నాయకత్వంలో 'నీళ్లు, నిధులు, నియామకాలు' అన్న తెలంగాణ ఉద్యమ నినాదం సాకారమైంది. ఇంటింటికి మంచినీళ్లు, పొలాలకు సాగునీరు తెచ్చాము. కాళేశ్వరం తో పాటు మిగతా సాగునీటి పథకాలతో వరి ఉత్పత్తిలో దేశంలో నంబర్ వన్‌గా తెలంగాణ నిలిచింది. పదేళ్లలో తలసరి ఆదాయంలో భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిపాము. రైతుబంధు, రుణమాఫీ ద్వారా లక్ష కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసాము. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 24 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించాము" అని కేటీఆర్ గుర్తు చేశారు.కానీ రేవంత్ రెడ్డి హయాంలో నీళ్లు పాతాళంలోకి, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి. రైతులకు రుణమాఫీ లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఒక్క సంవత్సరంలో రూ.1,50,000 కోట్ల అప్పు చేసి, ఒక్క కొత్త పథకం కూడా ప్రారంభించలేదు. 450 మంది రైతులు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారు" అని కేటీఆర్ ఆరోపించారు.రాబోయే పంచాయతీ, ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని సాధిస్తుందని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. "తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారే శ్రీరామరక్ష అన్న కేటీఆర్, గులాబీ జెండా ఎగిరితేనే తెలంగాణ గెలుస్తుంది నిలుస్తుందని అన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు