కీరవాణి క‌న్స‌ర్ట్ కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్న‌ : రాజ‌మౌళి

కీరవాణి క‌న్స‌ర్ట్ కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్న‌ : రాజ‌మౌళి

లోకల్ గైడ్:
త‌న అన్న‌య్య కీరవాణి క‌న్స‌ర్ట్ కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్న‌ట్లు తెలిపాడు దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి.ఆస్కార్ అవార్డు గ్ర‌హీత,ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి  లైవ్ క‌న్స‌ర్ట్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌కటించిన విష‌యం తెలిసిందే.‘నా టూర్‌ ఎం.ఎం.కె'పేరిట ఈ కన్స‌ర్ట్ చేయ‌నుండ‌గా..మార్చి 22న సాయంత్రం 7గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ ఈవెంట్‌ ప్రారంభం కానుంది.అయితే ఈ వేడుక‌ను స‌క్సెస్ చేయాల‌ని కోరుతూ ఆయ‌న త‌మ్ముడు దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఒక వీడియో విడుద‌ల చేశారు.ఈ వీడియోలో అభిమానుల నుంచి స‌పోర్ట్‌ను కోరారు.మార్చి 22 కోసం నేను చాలా ఆతృత‌గా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ఆరోజు అన్న‌య్య ఎం.ఎం.కీరవాణి కన్స‌ర్ట్ ఉంది.ఈ క‌న్స‌ర్ట్‌లో నా సినిమాలోని పాట‌ల‌తో పాటు ఆయ‌న సంగీతం అందించిన పాట‌ల‌ను పాడ‌నున్నారు.నా డిమాండ్ ఏంటి అంటే ఆయ‌న ఒ.ఎస్‌.టి (ఒరిజినల్‌ సౌండ్‌ ట్రాక్‌)లూ ఉండాలనేది నా డిమాండ్‌.ఎందుకంటే ఆయన రీ రికార్డింగ్‌ అద్భుతంగా ఉంటుంది. ఆయన పాట‌లు ఎంత ఫేమ‌సో అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లు కూడా అంతే ఫేమ‌స్.ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ల‌ను,ఒ.ఎస్‌.టి ల‌ను లైవ్‌లో ప్లే చేయాలని కోరుకుంటున్నా అంటూ రాజ‌మౌళి చెప్పుకోచ్చాడు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు