పాకిస్థాన్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ర‌ద్దు..

పాకిస్థాన్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ర‌ద్దు..

లోకల్ గైడ్:
ఇవాళ బంగ్లాదేశ్‌తో రావ‌ల్పిండిలో జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ను వ‌ర్షం వ‌ల్ల ర‌ద్దు చేశారు. దీంతో ఆతిథ్య జ‌ట్టు పాకిస్థాన్‌..ఒక్క గెలుపు లేకుండానే..చాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి నిష్క్ర‌మించింది.పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ మ‌ధ్య చాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా రావ‌ల్పిండిలో ఇవాళ జ‌ర‌గాల్సిన గ్రూప్ ఏ మ్యాచ్ వ‌ర్షం వ‌ల్ల రద్దు అయ్యింది.ఒక్క బంతి కూడా ప‌డ‌కుండానే మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు.దీంతో రెండు జ‌ట్లు చెరో పాయింట్ ల‌భించింది.ఆతిథ్య‌దేశం పాకిస్థాన్ గ్రూపులో ఒక పాయింట్‌తో నాలుగ‌వ స్థానంలో నిలిచింది.ఒక్క మ్యాచ్ కూడా నెగ్గ‌కుండానే టోర్నీ నుంచి పాక్ నిష్క్ర‌మించింది.న్యూజిలాండ్‌, ఇండియా చేతిలో ఓడిన పాక్ జ‌ట్టు..త‌న చివ‌రి మ్యాచ్‌లో స‌త్తా చాట‌నుకున్న‌ది.కానీ వ‌ర్షం వ‌ల్ల ఆ అవ‌కాశం ద‌క్క‌లేదు.2017లో చాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచి,ఈ సారి డిఫెండింగ్ చాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగిన పాకిస్థాన్‌కు టోర్నీలో చేదు అనుభ‌వం మిగిలింది.పాకిస్థాన్ క‌న్నా ఉత్త‌మ నెట్ ర‌న్‌రేట్ క‌లిగి ఉన్న‌ బంగ్లాదేశ్ జ‌ట్టు గ్రూప్ ఏలో మూడ‌వ స్థానంలో నిలిచింది.రావ‌ల్పిండిలో బుధ‌వారం రాత్రి మొత్తం వ‌ర్షం కురిసింది.దీంతో మైదానం చిత్త‌డిగానే ఉన్న‌ది.ప‌లుమార్లు ఇవాళ అంపైర్లు..పిచ్‌ను ప‌రిశీలించినా..ఆట‌కు అనుకూలంగా లేక‌పోవ‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు.గ్రూపు ఏ నుంచి న్యూజిలాండ్‌,ఇండియా జ‌ట్లు సెమీఫైన‌ల్లోకి ప్ర‌వేశించాయి.ఆట‌గాళ్ల‌లో అనుభ‌వం లేక‌పోవ‌డం వ‌ల్లే టోర్నీ నుంచి పాకిస్థాన్ త్వ‌ర‌గా నిష్క్ర‌మించిన‌ట్లు తాత్కాలిక చీఫ్ సెలెక్ట‌ర్ అకీబ్ జావెద్ తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు