వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.

వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.

 శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు
 దేవాలయాలకు పోటెత్తిన భక్తులు
 దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
లోకల్ గైడ్/తాండూరు: తాండూర్ ప్రజలు మహాశివరాత్రి పర్వదినం వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. బుధవారం మహాశివరాత్రి సందర్భంగా శివనామస్మరణలతో శైవక్షేత్రాలు మార్మోగాయి. శివరాత్రి సందర్భంగా పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయం, కోటేశ్వర దేవాలయం, అంతప్పబావి శివాలయం, చెరువెంటి ఈశ్వరాలయం తదితర శైవక్షేత్రాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి.పండుగను పురస్కరించుకుని కుటుంబంలోని చిన్నా, పెద్ద అంతా తరలివచ్చి ఆలయాల్లో వెలసిన శివుని, శివలింగానికి, సంధీశ్వరుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివునికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలను సమర్పించుకున్నారు. అదేవిధంగా ఆలయాల్లోని శివలింగాలు అభిషేకాలతో తడిసి ముద్దయ్యాయి. మహా శివరాత్రిని పురస్కరించుకుని శివున్ని దర్శించుకునేందుకు ఆలయాలకు వేలాధిగా భక్తులు తరలిరావడంతో ఆలయాన్ని కిట కిటలాడాయి. మరోవైపు శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు సాయంత్రం వేళ శివున్ని దర్శించుకుని ఫలహారాలు తీసుకుని దీక్షలను విరమించారు.శివున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి: మరోవైపు తాండూరు పట్టణంలో వెలసిన వివిధ శివాలయాల్లో శివున్ని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు. మహాశివరాత్రి వేడుకల సందర్భంగా భద్ర శ్వరాలయం, చెరువెంటి ఈశ్వరాలయం, అంతప్పభావి, కోటేశ్వర దేవాయలం తదితర ఆలయాలలో జరిగిన కార్యక్రమాలకు నేతలతో కలిసి హాజరయ్యారు. ఆయా దేవాలయాల్లో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి, భద్రేశ్వర దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, రొంపల్లి సంతోష్ కుమార్, ఆయా దేవాలయాల ప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.నగరేశ్వర దేవాలయంలో పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో మహా శివరాత్రి వేడుకలను జరుపుకున్నారు. వాసవి మహిళ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక శివలింగంను ఏర్పాటు చేశారు. శివునికి ప్రత్యేక అలంకరణతో పాటు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య హాజరై శివున్ని దర్శించుకున్నారు. ఆలయంలో భజన కీర్తనలతో భక్తులు. సంఘం సభ్యులు శివున్ని కొలిచారు. ఈ కార్యక్రమంలో వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ, కార్యదర్శి మంకాల స్వప్న, ఉపాధ్యక్షురాలు గుబ్బ ప్రగతి, తాళ్లపల్లి కవిత, కోశాధికారి సింగంశెట్టి శోభ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు