ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేయడమే మా లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేయడమే మా లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

లోకల్ గైడ్, హైదరాబాద్: అన్ని రంగాల్లో నైపుణ్య మానవ వనరుల కోసం ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేయడమే మా లక్ష్యమనీ,ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తున్నారని పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.మాదాపూర్ లో "హెచ్ సీఎల్ టెక్నాలజీస్ గ్లోబల్ డెలివరీ సెంటర్" ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీ నీ ఏర్పాటు చేశాం. ఆనంద్ మహీంద్రా లాంటి ప్రముఖులను ఈ యూనివర్సిటీ నిర్వహణలో భాగస్వామ్యం చేశాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందిస్తూ... పరిశ్రమలకు అవసరమైన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ను అందిస్తున్నాం.  స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీ నిర్వహణలో హెచ్ సీఎల్ టెక్నాలజీస్ కూడా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తున్నా.తెలంగాణ ను  ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దాలన్నది మా లక్ష్యం. ఇది అంత తేలికైన విషయం కాదు. కానీ... మేం చిత్తశుద్ధితో కృషి చేసి... ఈ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఈ లక్ష్య సాధనలో ఐటీ రంగం కీలక పాత్ర పోషించాలని కోరుతున్నా. ఐటీ పరిశ్రమలు సాంప్రదాయబద్ధంగా కాకుండా ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనేలా కొత్తగా ఆలోచించాల్సిన అవసరముంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను గ్లోబల్ వాల్యూ సెంటర్లు మార్చుతాం. వీటిల్లో తెలంగాణ యువత అధిక సంఖ్యలో ఉద్యోగావకాశాలు దక్కించుకునేలా వారిని తీర్చి దిద్దుతామని శ్రీధర్ బాబు అన్నారు.ఎఐ, మెషీన్ లెర్నింగ్, క్వాంటం కంప్యూటింగ్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో తెలంగాణ ను హబ్ గా మారుస్తాం. ఈ టెక్నాలజీస్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ప్రారంభించబోతున్నాము. ఇందుకోసం ఇప్పటికే స్విట్జర్లాండ్ కి చెందిన దిగ్గజ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని మంత్రి తెలిపారు.కాంగ్రెస్ హయాంలో నే ఐటీ రంగం అభివృద్ధి చెందింది. ఇందుకు 1992 లోనే పునాది పడింది. అప్పట్లో ఏర్పాటు చేసిన సాప్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ ఐటీ రంగం అభివృద్ధి కి మార్గ నిర్దేశనం చేసింది. ఈ స్ఫూర్తితో హైదరాబాద్ ను ఐటీ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్తాం. హైదరాబాద్ నూతన ఆవిష్కరణలకు హబ్ గా మారింది. ఇటీవలి కాలంలో ఇక్కడి నుంచి 15 పేటెంట్స్ రావడం సంతోషకరం. యావత్తు ప్రపంచం టెక్నాలజీ అంటేనే హైదరాబాద్ వైపు చూసేలా చేస్తామని మంత్రి తెలిపారు.హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ సాధించిన ప్రగతి తెలంగాణ కు గర్వకారణం. ఈ నూతన క్యాంపస్ ద్వారా కొత్తగా 5వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయని ఆయన తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు