ఎంపీ వద్దిరాజు తిరుపతిలో శ్రీవెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

ఎంపీ వద్దిరాజు తిరుపతిలో శ్రీవెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

లోకల్ గైడ్, హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి కలియుగ ఇష్ట దైవం తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.ఎంపీ రవిచంద్ర -విజయలక్మీ పుణ్య దంపతులు గురువారం ఉదయం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని గోత్ర నామాలు, భక్తిప్రపత్తులతో ప్రత్యేక పూజలు చేశారు, కొబ్బరికాయలు కొట్టారు.వేద పండితులు ఎంపీ రవిచంద్రను శాలువాతో సత్కరించి, ఆశీర్వచనాలు పలికి దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అలాగే,వారు పద్మావతి, అలివేలు మంగతాయారు అమ్మ వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఎంపీ రవిచంద్ర తెలంగాణ రాష్ట్రం  పాడిపంటలతో, ప్రజలు సుఖ సంతోషాలతో, సుభిక్షంగా వర్థిల్లాలి అని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శ్రీవెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు,జనహృదయ నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించాలని, తిరిగి అధికారంలోకి రావాలని ఎంపీ వద్దిరాజు శ్రీవెంకటేశ్వర స్వామి తో పాటు పద్మావతి, అలివేలు మంగతాయారు అమ్మ వార్లను వేడుకున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు