వెంకన్నను దర్శించుకున్న జాన్వీ కపూర్
By Ram Reddy
On
లోకల్ గైడ్: అలనాటి అందాల తార శ్రీదేవి తనయ, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor)కు దైవభక్తి ఎక్కువన్న విషయం తెలిసిందే. ఖాళీ సమయం దొరుకుతే చాలు తిరుమలలో వాలిపోతుంటుంది. ముఖ్యంగా పుట్టినరోజు, సినిమా రిలీజ్‌లు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో వెంకన్న (Lord Venkateswara) ఆశీస్సుల కోసం తిరుమల కొండకు వెళ్తుంటుంది. స్నేహితులు, బంధువులతో కలిసి ఏడుకొండలవాడిని దర్శించుకుంటుంది. తాజాగా ఇవాళ కూడా జాన్వీ వెంకన్నను దర్శించుకుంది.కొత్త ఏడాది సందర్భంగా స్నేహితుడు శిఖర్ పహారియా (Shikhar Pahariya)తో కలిసి శనివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొంది. ఆలయానికి చేరుకున్న జాన్వీ కపూర్‌కు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
హెచ్‌ఎంపీవీ వైరస్..
08 Jan 2025 16:01:47
లోకల్ గైడ్: దేశంలో హెచ్‌ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు వైరస్ ఏడుగురికి పాజిటివ్‌గా తేలింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల...
Comment List