కొత్త ఏడాది కదా అని ఫుల్లుగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దు..

షాద్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్..

కొత్త ఏడాది కదా అని ఫుల్లుగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దు..

లోకల్ గైడ్ న్యూస్  :రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.నూతన సంవత్సరానికి సంబంధించి సూచనలు..

ఈ సందర్భంగా టౌన్ సీఐ విజయకుమార్  మాట్లాడుతూ డి‌జే మరియు సౌండ్ బాక్స్ లకు, పెద్ద పెద్ద శబ్దాలకు  ఎలాంటి అనుమతులు లేవు.రిసార్ట్ మరియు ఫామ్ హౌస్ లపై ప్రత్యేకమైన నిఘా వుంటుంది.రిసార్ట్ మరియు ఫార్మ్ హౌస్ లలో  ఎలాంటి ఆశీల్లత కార్యక్రమాలు జరపకూడదు..

తాగి రోడ్డెక్కితే అంతే..

మద్యం త్రాగి, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, చేసిన వాహన నియామ నిబందలను పాటించకుండా వాహనాలు నడిపిన వారిపై వాహనాలు సీజ్ చేసి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.31 డిసెంబర్ అర్దరాత్రి సమయం లో నూతన సంవత్సరం వచ్చిన సంధార్బంగా ఎవ్వరూ కూడా రేసింగ్ లు , బైక్ ర్యాలీలు చేయుటకు అనుమతి లేదు.31 డిసెంబర్ సాయంత్రం నుండి నూతన సంవత్సరం ఉదయం సమయం వరకు మండల వ్యాప్తంగా పకడ్బందీగా  పెట్రోలింగ్ మరియు బందో బస్త్,నాకాబందీ, వాహన తనికీలు  మరియు  డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించడం జరుగుతుంది.బహిరంగ ప్రదేశాలలో ఎవరైనా వేడుకల పేరుతో ఇతరులకు ఇబ్బందులు గురిచేసిన యెడల అట్టి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసు శాఖ నుండి వెలువడిన సూచనలు సలహాలను అతిక్రమించిన వారిపై ప్రజా భద్రత రీత్యా చట్టపరమైన చర్యలను తీసుకోవడము జరుగుతుంది. సంతోష కరమైన రోజుని విషాదకరంగా చేసుకోవద్దు 
సంతోషకరంగా సురక్షితంగా నూతన సంవత్సర వేడుకలను  తమ తమ కుటుంబ సభ్యులతో స్నేహితులతో  కలసి జరుపుకోవాలని కోరడం జరుగుతుంది.ప్రజలకు ఏమైనా శాంతిభద్రతల సమస్య ఉంటే డైల్ 100 కి డయల్ చేయాలని తెలిపారు..

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక
లోకల్ గైడ్: కేశంపేట మండల కేంద్రంలో  బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళల యొక్క హక్కుల కోసం చదువుల కోసం మరియు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అలుపెరగని...
సారు కేశంపేట్ కు సర్వేరు రారా..
ఓ గురువర్యా! నీ స్థానమేక్కడ?
తొలి మహిళా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194 జయంతి
మహనీయుల స్ఫూర్తి,  ఆశయాలతో ముందుకు సాగాలి
రేషన్‌ కార్డులో మీ వాళ్ల పేర్లను చేర్చాలా.. అయితే ఇదే ప్రాసెస్ 
పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు..!