అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్....
లోకల్ గైడ్: అన్ స్టాపబుల్ షో ఇండియాలోనే టాప్ టాక్ షోగా దూసుకుపోతుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగానే కాదు.. టాక్ షోతో కూడా రాణిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలయ్య చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ మూడు సీజన్స్ పూర్తి చేసుకొని నాలుగో సీజన్స్ దూసుకుపోతుంది. అన్ స్టాపబుల్ సీజన్ 4లో చాలా మంది స్టార్ నటీనటులు గెస్ట్ గా హాజరయ్యారు. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ అన్నపూర్ణలో జరుగుతుంది.అన్‌స్టాపబుల్ సెట్‌లో రామ్ చరణ్ సందడి చేశారు. గేమ్ చేంజర్ ప్రమోషన్‌లో భాగంగా అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్నారు చరణ్.. సంక్రాంతిలో బాలయ్య, చరణ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డాకూ మహారాజ్‌గా వస్తున్న బాలయ్య. అలాగే గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు చరణ్. ఈ సందర్భంగా ఇద్దరి సినిమాలు ఘన విజయం సాధించాలని బాలయ్య అన్నారు .
Comment List