ప్రజావాణికి  ఫిర్యాదుల వెల్లువ.. 

ప్రజావాణికి  ఫిర్యాదుల వెల్లువ.. 

ప్రజా సమస్యల సత్వరనే పరీక్షించాలని అధికారులకు ఆదేశాలుజిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి..

లోకల్ గైడ్:ప్రజావాణికి (50 ) ఫిర్యాదులు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (50) ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవిస్తూ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి అర్జీలు సమర్పించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ–31, పిడి హౌసింగ్ – 10, డీపీఓ-02, మున్సిపల్-02, ల్యాండ్ ప్రొటెక్షన్ -02, విద్యుత్తు -01, ఎండోమెంట్ – 02, మొత్తం 50 దరఖస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు  పాల్గొన్నారు..

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక
లోకల్ గైడ్: కేశంపేట మండల కేంద్రంలో  బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళల యొక్క హక్కుల కోసం చదువుల కోసం మరియు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అలుపెరగని...
సారు కేశంపేట్ కు సర్వేరు రారా..
ఓ గురువర్యా! నీ స్థానమేక్కడ?
తొలి మహిళా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194 జయంతి
మహనీయుల స్ఫూర్తి,  ఆశయాలతో ముందుకు సాగాలి
రేషన్‌ కార్డులో మీ వాళ్ల పేర్లను చేర్చాలా.. అయితే ఇదే ప్రాసెస్ 
పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు..!