పరాయి నేలపై టీ20 లీగ్... చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన న్యూజిలాండ్.
లోకల్ గైడ్ :
టీ20లకు ఆదరణ పెరగడంతో ఫ్రాంచైజ్ క్రికెట్ జోరందుకుంది. ఐపీఎల్ తరహాలో పలు దేశాల్లో పొట్టి క్రికెట్ లీగ్స్ జరుగుతున్నాయి. ఫ్రాంచైజ్ క్రికెట్ క్రేజ్ గుర్తించిన న్యూజిలాండ్ క్రికెట్(Newzealand Cricket) త్వరలోనే కొత్త లీగ్‌కు శ్రీకారం చుట్టనుంది. Newzealand Cricket : టీ20లకు ఆదరణ పెరగడంతో ఫ్రాంచైజ్ క్రికెట్ జోరందుకుంది. ఐపీఎల్ తరహాలో పలు దేశాల్లో పొట్టి క్రికెట్ లీగ్స్ జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజ్ క్రికెట్ క్రేజ్ గుర్తించిన న్యూజిలాండ్ క్రికెట్ (Newzealand Cricket) త్వరలోనే కొత్త లీగ్‌కు శ్రీకారం చుట్టనుంది. పరాయి గడ్డపై ఒక టీ20 లీగ్‌ను నిర్వహించనుంది. తద్వారా విదేశంలో ఫ్రాంచైజ్ క్రికెట్ జరపనున్న ఐసీసీ పూర్తి సభ్యత్వం కలిగిన తొలి దేశంగా న్యూజిలాండ్ రికార్డు సృష్టించనుంది. అమెరికాకు చెందిన ట్రూ నార్త్ స్పోర్ట్స్(True North Sports) వెంచర్స్‌తో కలిసి కొత్త మేజర్ క్రికెట్ లీగ్ ప్రారంభానికి కివీస్ సన్నాహకాలు చేస్తోంది.‘ట్రూ నార్త్ స్పోర్ట్స్ వెంచర్‌తో ఒప్పందం కుదరడం న్యూజిలాండ్ క్రికెట్‌లో ఒక మైలురాయి. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజ్ క్రికెట్ ఊపందుకుంటుంది. మా క్రికెట్ నెట్‌వర్క్‌తో కలసి.. టీ20ల్లో కొత్త అధ్యాయం లిఖించాలని అనుకుంటున్నాం. దాంతో, మాకు ఆదాయ వనరులు పెరగడమే కాకుండా.. అంతర్జాతీయంగా మా బోర్డుకు మరింత పేరు రానుంది. అంతేకాదు.. అభిమానగణమూ పెరగనుంది. ఆ దేశంలోని క్రికెటర్లకు, కోచ్‌లకు ఈ లీగ్ ఉపయోగపడనుంది’ అని న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ స్కాట్ వీనింక్(Scott Weenink) ఓ ప్రకటనలో వెల్లడించాడు.
Comment List