డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి

జాతీయ యువజన అవార్డు గ్రహీత  జక్కి శ్రీకాంత్.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి

లోకల్ గైడ్ తెలంగాణ:

వర్ధన్నపేట మండల కేంద్రంలో మహానీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్, జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహానీయుల స్ఫూర్తి యాత్ర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య, మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు,బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మచ్చ రాజు,  ముగింపు యాత్రలో పాల్గొని మహానీయుల చిత్రపటాలతో స్వామి వివేకానంద విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరానితనం వివక్షల పై అలుపెరుగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దిశా దశలు చూపిన స్ఫూర్తిదాత ఆర్థికవేత్త రాజనీతిజ్ఞుడు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేటి తరానికి స్ఫూర్తి అని అన్నారు. పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అని ఈ దేశానికి పాలకులు కావడమే మన లక్ష్యమని,ఇంతకాలం బాధితులుగా ఉన్నాం  ఇక మనం పాలకులుగా మారుదామని బహుజనులను చైతన్యపరిచిన మహా పురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. 1931లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని దళితులకు హక్కులు కల్పించిన దళిత అభ్యుదయ వాది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రపంచానికి జ్ఞానాన్ని పంచి నేడు ప్రపంచం మొత్తం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని జ్ఞాన దినోత్సవంగా జరుపుకోవడం ఈ దేశానికి ఎంతో గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పొలిటి బ్యూరో సభ్యులు ఈరెల్లి శ్రీనివాస్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచర్ల మహేష్, వరంగల్ జిల్లా కో కన్వీనర్ జంగిలి భాస్కర్, జాతీయ బిసి సంక్షేమ సంఘం వర్ధన్నపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మామిండ్ల చెన్నయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం వర్ధన్నపేట పట్టణ అధ్యక్షులు నందిపాక భాస్కర్, కొండేటి మహేందర్, ఎమ్మార్పీఎస్ నాయకులు చాడ కరుణాకర్, దళిత శక్తి నాయకులు ఆరోగ్యం, విజయలక్ష్మి, శ్రీనివాస్, రాజు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యూవత క్రీడారంగంలో రణ్ణించాలి యూవత క్రీడారంగంలో రణ్ణించాలి
లోకల్ గైడ్: మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి
భారత రాజ్యాంగమే దేశానికి ప్రజలకు రక్ష 
అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంబు ప్రభాకర్
బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంబేద్కర్ కు నివాళులర్పించిన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వా జయంతి సందర్భంగా నివాళులర్పించిన 
పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్ ని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ .