మున్నారుకాపు దశ దిశా ఆత్మీయ సమావేశం లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
లోకల్ గైడ్ తెలంగాణ:
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు మున్నూరుకాపుల దశ దిశా ఆత్మీయ సమావేశం లో ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది. ఈ రోజు నెక్లెస్రోడ్లోని జలవిహార్లో మున్నూరుకాపుల దశా దిశా ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, రాజ్యసభసభ్యులు వద్దిరాజు రవిచంద్ర, డాక్టర్ కె. లక్ష్మణ్ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు.ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణనలో మున్నూరుకాపుల సంఖ్య తగ్గించడం విచారకరమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు . గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, మంత్రి పదవులు అనుభవించామన్నారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం మూడున్నర శాతం చూపించి మున్నూరుకావులను చట్టసభలకు దూరం చేస్తున్నారన్నారు.బీసీలను తక్కువ చేసి చూపించిన ప్రభుత్వం మున్నూరుకాపుల సంఖ్యను మరింత తక్కువ చేశారన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం మున్నూరుకాపులకు తీరని అన్యాయం చేసిందన్నారుకాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న బీసీలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఆయనను సస్సెండ్ చేశారన్నారు. సమగ్ర కులగణన ఆధారంగా 3.34కోట్ల జనాభాలో 13 లక్షలే ఉన్నామంటే సిగ్గుచేటన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తున్నారని, ఉత్తర భారతంలో రాష్ట్రాల్లో బీసీలు ఎటువైపేతే పార్టీలు అటువైపు మొగ్గు చూపుతున్నాయని. ఆ దిశగా చైతన్యం పెరిగిందన్నారు.అనంతరం పలు తీర్మానాలను ప్రవేశ పెట్టడం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, కే. కేశవరావు, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య పటేల్, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్థార్ పుటం పురుషోత్తమ రావు, మున్నూరుకాపు గర్జన నిర్వహణ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ చందు జనార్ధన్ పటేల్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, జోగు రామన్న, బాజిరెడ్డి గోవర్ధన్, కోరకంటి చందర్, నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్, మాజీ టీ స్ పి స్ సి మెంబెర్ విట్టల్ , జగిత్యాల జిల్లా మాజీ జెడ్సి చైర్మన్ వసంత్, మున్నూరుకాపు మహాసభ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణికొండ వెంకటేశ్వర్ రావు, మంగళారపు లక్ష్మణ్, మున్నూరుకాపు యువత రాష్ట్ర అధ్యక్షలు బండి సంజీవ్,సంఘం అధ్యక్షులు వనమాల ప్రవీణ్, మున్నూరుకాపు డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు ఎడ్ల రవి,తెలంగాణ మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్, మున్నూరుకాపు సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఆర్వీ మహేందర్ కుమార్,మహిళా అధ్యక్షులు బండి పద్మ, యూత్ ఫోర్స్ అధ్యక్షులు అఖిల్,, మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక, సంఘం ప్రముఖులు చెరుకూరి శేషగిరి రావు,లవంగాల అనిల్, ఆవుల రామారావు, మాజీ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ సర్పంచ్లు, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List