భారతదేశ గొప్ప దర్శానికుడు దూరదృష్టి గల సంస్కర్త
డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ కు పూల మాల వేసిన నివాళులర్పించిన
అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్.
లోకల్ గైడ్ న్యూస్:
సోమవారం అంబేద్కర్ చౌక్ లో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్న అఖిలపక్ష ఐక్యవేదిక ఆయన విగ్రహానికి పూలమాల వేసిన తరువాత మాట్లాడుతూ, మా అఖిలపక్ష ఐక్యవేదిక వారోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి కూడా రావడం మా అదృష్టమని ఈ 135వ జయంతి ని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని, అంబేద్కర్ అంటే ఈ దేశ భవిష్యత్తు అని ఆయన వేసిన బాటలో సోమవారం రాజ్యాంగం నడుస్తుందని, దాని ప్రకారం ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారని, ప్రశ్నించే అధికారం కూడా వచ్చిందని, శతాబ్దం తర్వాత కూడా ఆయనను ఒక వర్గానికి నాయకుడుగా పరిగణిస్తున్న వారు అజ్ఞానులని, అలా పరిగణించే వారిని సంగం నుండి వెలివేసి ఒక ద్వీపంలో పెట్టాలని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, బిసి జిల్లా నాయకులు గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, డీఎస్పీ పట్టణ అధ్యక్షుడు గంధం భరత్, మిద్దె నగేష్, శివకుమార్, శ్రీధర్ గౌడ్, పుట్టపాక బాలు, పాషా, కురుమూర్తి, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comment List