పూలే స్ఫూర్తితో మూఢనమ్మకాల నిర్మూలన కృషి చేస్తాం

 --సిఐటియు.

పూలే స్ఫూర్తితో మూఢనమ్మకాల నిర్మూలన కృషి చేస్తాం

లోకల్ గైడ్ :

గొప్ప సంఘ సంస్కర్త, చదువు ప్రాధాన్యతను గుర్తించినవాడు, కుల వివక్షను, మూఢనమ్మకాలను వ్యతిరేకించిన మహాత్మ జ్యోతిబాపూలే  స్ఫూర్తితో కార్మికుల్లో ఉన్న మూఢనమ్మకాల వ్యతిరేకంగా చైతన్య పరుస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య అన్నారు. శుక్రవారం సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ ఏప్రిల్ 6 నుండి14 పిలుపులో భాగంగా సిఐటియు నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బేవరేజెస్ అమాలి వర్కర్స్ యూనియన్ గోదాం ఇందిరా నగర్ లో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మూఢనమ్మకాలు పెరిగి విద్యకు దూరమై వివక్షతకు గురై అవస్థలు పడుతున్న ప్రజలకు చైతన్యం కల్పిస్తూ అనేక సంస్కరణలపై పోరాడిన యోధుడని కొనియాడారు. సతీసహగమనం అంటరానితనం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ సొంతంగా పాఠశాలలు నెలకొల్పి తన భార్య సావిత్రిబాయి పూలే కు మొదట విద్య నేర్పించి మహిళలకు విద్య నేర్పిన మహనీయుడు అని అన్నారు. నేడు బిజెపి ప్రభుత్వం వేల సంవత్సరాల నాటి బూజు పట్టిన మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఆరోపించారు. దేశభక్తి ముసుగులో మతం పేరుతో శ్రామిక ప్రజలు కార్మికులలో చిచ్చు పెడుతుందని అన్నారు దళితులు గిరిజనులు మహిళలపై విచ్ఛావిడిగా దాడులు చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని భగ్నం చేస్తుందని ఆరోపించారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలపై హింస రెట్టింపు స్థాయిలో పెరిగిందని అనేక కేసుల్లో బాధితులపై హత్యలు అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులపై కుల దురహంకార హత్యలు భువనగిరిలో అంబోజి నరేష్ ను మంథని లో మధు లను హతమార్చిన అమానుష ఘటనలు జరుగుతున్నాయన్నారు కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంటూ ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. మహనీయుల స్ఫూర్తితో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ మే 20న జాతీయ కార్మిక సంఘాల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కు కార్మిక వర్గాలు సన్నద్ధమవుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు అవుట రవీందర్, అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి, తెలంగాణ బేవరేజెస్ హమాలి వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షులు జేరిపోతుల సైదులు, కార్యదర్శి తొట్ల లింగయ్య, ఉపాధ్యక్షులు క్యాస రమేష్, కోశాధికారి తోర్పునూరి ప్రసన్నకుమార్, సభ్యులు పాయిల అరుణ్, వనపర్తి సైదులు, సోమలింగస్వామి, తొట్ల సోములు, మట్టిపల్లి పాండు, దొండ మధు, తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

చదువు పట్టుదల ఉంటే, పేదోడైన ప్రపంచమేదావి కాగలడని నిరూపించిన అంబేద్కర్ చదువు పట్టుదల ఉంటే, పేదోడైన ప్రపంచమేదావి కాగలడని నిరూపించిన అంబేద్కర్
అందే బాబయ్య " బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ను అవమానించిన"అంటరాని వారిగా చూసిన" ఈ...
అంబేద్కర్ ఆశయ సిద్ది కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి .
తెలంగాణ రాష్ట్రం గవర్నర్ 
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతిని ఘనంగా నిర్వహించుకున్న ఐటిడిఎ ,పిఓ బి ,రాహుల్.
డా:బి.ఆర్ అంబేద్కర్,కా:జార్జిరెడ్డిల
ఆత్మ గౌరవంతో బతకాలని పోరు చేసిన మహాత్మా ఫూలే