వృద్ధులకు గుడ్ న్యూస్!... పింఛన్ల పంపిణీ పై మరో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం?
లోకల్ గైడ్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ పై మరొ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఫింగర్ ప్రింట్ ద్వారా పెన్షన్లు అందజేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇకపై ఫేషియల్ రికగ్నేషన్ విధానాన్ని తీసుకురా పోతున్నామని ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సెర్ప్ అనే యాప్ను రూపొందిస్తుంది. మే లేదా జూన్ నెల నుంచి దీన్ని ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటికే చాలామంది వృద్ధులకు వేలిముద్రలు పడక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండడంతో ... ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా... తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరిలో 42.96 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇందులో దివ్యాంగులకు 4016 రూపాయలు, ఇక ఇతరుల ప్రతి ఒక్కరికి 2016 రూపాయలు అందజేస్తున్నారు.
Comment List