నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
ఒక్కో బుక్‌పై 60 శాతం డిస్కౌంట్!
లోకల్ గైడ్:
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం ప్రచురించిన గ్రంథాలను ప్రత్యేక రాయితీతో విక్రయించడానికి పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్ 7: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం ప్రచురించిన గ్రంథాలను ప్రత్యేక రాయితీతో విక్రయించడానికి పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నాంపల్లి ప్రాంగణంలో గల పుస్తక విక్రయ కేంద్రంలో ఈ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది తెరిచి ఉంటుందని వెల్లడించారు.ఈ పుస్తక ప్రదర్శలో ప్రతి పుస్తకంపై 60 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ప్రాచీన గ్రంథాలు, సాహిత్యం, నిఘంటువులు, సంగీత, నృత్య గ్రంథాలు, భారత, భాగవతాలు, ప్రబంధాలు, పురాణాలు, పంచకావ్యాలు, ఇతిహాసాలు, చరిత్ర గ్రంథాలు, పోటీ పరీక్షల పుస్తకాలు తగ్గింపు ధరలలో విక్రయానికి సిద్ధంగా ఉంటాయని, సాహితీవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు, భాషా ప్రియులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Comment List