సామాన్యులకు కంపెనీల షాక్ ....
లోకల్ గైడ్:
సామాన్యులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. ఓ వైపు ధరల పెరుగుదలతో ఇబ్బందిపడుతున్న జనం నెత్తిన మరోసారి భారం మోపాయి. గృహ వినియోగ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఒకేసారి రూ.50 ధరను పెంచాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సోమవారం ఎల్‌పీజీ ధరలను రూ.50 పెంచుతున్నట్లు ప్రకటించారు. ఉజ్వల, సాధారణ కేటగిరీ వినియోగదారులకు గ్యాస్ ధరను పెంచినట్లు మంత్రి ప్రకటించారు. దాంతో 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.803 నుంచి రూ.853కి పెరగనున్నది. ఇక ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు 14.2 కేజీల సిలిండర్ ధర రూ.503 నుంచి రూ.553కి చేరనున్నది. పెరిగిన సిలిండర్ ధరలు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి.ఇదిలా ఉండగా.. కేంద్రం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.2 ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవని పేర్కొంది. ఎక్సైజ్ డ్యూటీ పెరుగుదలతో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో.. పెరుగుదల ఉండదని చమురు మార్కెటింగ్ కంపెనీలు సమాచారం ఇచ్చినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్‌లో వాణిజ్య యుద్ధం భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పతనమ్యాయి. ఈ క్రమంలో కేంద్రం సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Comment List