పేద ప్రజల ఆత్మగౌరవ పథకం.. సన్న బియ్యం పంపిణీ.

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. 

పేద ప్రజల ఆత్మగౌరవ పథకం.. సన్న బియ్యం పంపిణీ.

జిల్లేడు చౌదరి గూడెం మండల కేంద్రంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

లోకల్ గైడ్:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవారి ఇంటికి సన్న బియ్యం చేరాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం జిల్లేడు చౌదరి గూడెం మండల కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పధకం సన్న బియ్యం పథకం కార్యక్రమాన్ని జిల్లేడు చౌదరి గూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేద ఇంటికి సన్నబియ్యం అందాలని, పేదవారికి పట్టెడన్నం పెట్టాలని గొప్ప ఆలోచనతో సన్న బియ్యం పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని అన్నారు. రాష్ట్రంలో మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం అందజేస్తూ అందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయిన ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. ఈ యొక్క సన్న బియ్యం పథకాన్ని రద్దు ఎవరు చేయలేరని తెలిపారు. చరిత్రలో శాశ్వతంగా సన్న బియ్యం పథకం నిలిచిపోతుందన్నారు. పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలని సంకల్పంతో ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందన్నారు. దొడ్డు బియ్యం   పిడిఎఫ్ చేసి మిల్లర్లు, దళారులు రీసైక్లింగ్ చేసి మళ్లీ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పేద వారి ఇంట ప్రతిరోజు ఆత్మగౌరవంతో ఇంటి ఇల్లాలు అందరూ సన్న బియ్యంను తినాలనే గొప్ప ఆలోచనతో ప్రభుత్వం బియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ యాసంగిలో వరి పంటలను రైతులు అధికంగా సాగు చేయడం జరిగిందని, రైతుల శ్రమ ఎక్కడికి పోదన్నారు .ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోని 25 లక్షల మందికి 21 వేల కోట్ల మేరకు రైతు రుణమాఫీ చెల్లించడం జరిగిందన్నారు. రైతు భరోసా 5000 కోట్ల నుంచి 12 వేల కోట్లకు పెంచిన గొప్ప ప్రజా ప్రభుత్వమన్నారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు . సన్నాలను పండించిన ప్రతి రైతుకు 500 బోనస్ ఇస్తామని, రైతులకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ జెడ్పిటిసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మండల ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు, తాలూకా బిసి సెల్ అధ్యక్షులు జాకారం చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ తనయుడు సన్ వల్లి ఆంజనేయులు, ఉమ్మడి మండల మాజీ ఎంపీపీ బసవరాజు గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ చంద్రబాబు గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకట్ నర్సింహారెడ్డి, మండల మాజీ ఎంపీపీ ఏజాస్, పద్మారం మాజీ సర్పంచ్ నర్సింలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింలు, బోయ రామచంద్రయ్య, పిఎసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి సత్యనారాయణ రెడ్డి, తహసీల్దార్ జగదీశ్వర్ ,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా ఇంచార్జీ పిట్ట రజిత, కావలి. బుచ్చయ్య,భాస్కర్,జక్కన్ని. భీమ్ రాజ్,బాలరాజు, వెంకటేశ్, వేణు, అన్వర్, చందు నాయక్,తదితరులు పాల్గోన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
లోక‌ల్ గైడ్: జైపూర్‌ నుంచి ముంబైకి బయలుదేరిన 6E 5324 నెంబర్‌ ఇండిగో విమానం టాయిలెట్స్‌లో లభ్యమైన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. విమానంలో బాంబుపెట్టామని...
రాబోయ్ మూడు గంటల్లో ఆ మూడు జిల్లాల్లో పిడుగుల వాన
అవ‌తార్‌ని మించి అట్లీ
టాస్‌ గెలిచిన కోల్‌కతా..
నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
ఆ ఒక్క సీన్ కోసమే రాజ‌మౌళి వంద కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడా..!
 బెదిరిస్తే.. బెదురుతామా ఏందీ..?