ఆ ఒక్క సీన్ కోసమే రాజమౌళి వంద కోట్లు ఖర్చు పెడుతున్నాడా..!
లోకల్ గైడ్:
Rajamouli | ఓటమెరుగని విక్రమార్కుడిగా రాజమౌళి ఇండియా సినిమాని శాసిస్తున్నాడు. ఒకటిని మించి మరోలా ఆయన సినిమాలు ఉంటున్నాయి. చివరిగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో అనేక రికార్డులు తిరగరాసాడు. Rajamouli | ఓటమెరుగని విక్రమార్కుడిగా రాజమౌళి ఇండియా సినిమాని శాసిస్తున్నాడు. ఒకటిని మించి మరోలా ఆయన సినిమాలు ఉంటున్నాయి. చివరిగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో అనేక రికార్డులు తిరగరాసాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ సుమారు 1000 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు సంబంధించిన షూటింగ్ పార్ట్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు రెండు షెడ్యూల్ లను పూర్తి చేసిన జక్కన్న మూడో షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరుపుతున్నాడని సమాచారం. ఈ మూవీలో గ్లోబల్ భామ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ ప్రాజెక్టుకు స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ కథను అందించారు. అమెజాన్ అడవుల్లో సాగే యాక్షన్ అడ్వెంచర్ గా సినిమా రూపుదిద్దుకుంటుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. గ్లోబల్ స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నట్టు తెలుస్తుండగా, రాజమౌళి చాలా కేర్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కో సీన్ ను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారట. ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఈ సినిమా ఎంగేజ్ చేసేలా ఈ చిత్రం ఉంటుందని అర్ధమవుతుంది. ఈ సినిమాలో ఒక్క యాక్షన్ సీన్ కోసం రాజమౌళి భారీగా ఖర్చు చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది.
Comment List